ఐడియాస్ కి -ఐడియల్ కి మధ్య రచ్చే చరణ్-దాసరి ల వార్

By Sindhu

ఈ మధ్య దాసరినారాయణరావు, రాంచరణ్ ల మధ్య మాటల యుద్ధం సినీ రంగంలో సంచలనం సృష్టించింది. ఒక చిన్న వ్యాఖ్య ఇంత రభస సృష్టిస్తుందా అని రాంచరణ్ తేజ ఆశ్చర్యపోతున్నారట. అనవ సరంగా చిన్న విషయాలపై ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటున్నట్లు కూడా ఆయన అనుకుంటు న్నారట. మనసుతోటి మాట్లాడుతున్నా.. మా యువతరంపై పెద్దతరం వారు.. ప్రేమగా ఉండటం లేదన్నది అతని బాధ. చుట్టు భజనపరులతో అలవాటు పడిన ఆ పెద్దవాళ్లకి.. రాణా, సిద్ధార్థ, జూనియర్ ఎన్టీఆర్ ల వ్యాఖ్యలు సహజంగానే నచ్చకపోవచ్చు.

అయితే చరణ్.. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. నిజానికి యువకులు ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడరు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వస్తోంది. మా అభిప్రాయం చెప్పడానికి మాకూ హక్కుంది. ప్రస్తుతం జరుగుతున్న వాటిపై ఎవరో ఒకరు మాట్లాడాలని చరణ్ అభిప్రాయ పడుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో యువతరం, వృద్దతరంగా రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఇది ఐడియాస్ కి, ఐడియల్స్ కి మధ్య ఘర్షనగా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే అందరూ యువతకు వ్యతిరేకంగా ఉన్నారని కాదు. తన తండ్రి చిరంజీవి కానీ, అలాగే వెంకటేశ్ కానీ ఇలాంటి విషయాల్ని పట్టించుకోరు. కొద్దిమంది మాత్రమే వీటిని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇకపై దీనికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానని రామ్ చరణ్ తేజ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X