Naga Chaitanya: రెండో పెళ్లికి రెడీ అయిన నాగచైతన్య... వధువు ఎవరంటే?
అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య తండ్రి బాటలోనే నడుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సినిమాల విషయంలోనే కాదు.. ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోనూ తండ్రినే అనుచరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. సమంతతో విడాకుల అనంతరం ఇన్నాళ్లకు ఆయన రెండో పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం. అయితే ఆ అమ్మాయి ఎవరు, ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. తండ్రి నాగార్జున ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జోష్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనంతరం రెండో చిత్రం ఏ మాయ చేశావే చేశాడు. ఇక ఈ చిత్రంలోనే సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా తెలుగు ప్రేక్షకులనే కాదు.. అక్కినేని వారసుడిని సైతం ఈ భామ మాయ చేసి పెళ్లి చేసుకుంది కూడా. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లా ఉండే వీరు.. సడెన్ గా విడాకులు అంటూ ప్రకటించడం షాక్ కు గురిచేసింది.

మేడ్ ఫర్ ఇచ్ అదర్ అనిపించుకున్న ఈ జంట పెళ్లైన నాలుగేళ్లకే విడిపోవడం అందరికి దిగ్ర్బాంతిని కలిగించింది. ఇక వీరి విడాకుల అనంతరం ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా మారిపోయారు. మరోవైపు సమంత మయోసైటిస్ బారిన పడటం.. ఆ చికిత్స తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు సినిమాల్లో బిజీగా మారిపోయింది. ఇటు నాగచైతన్య కూడా విడాకుల అనంతరం కొన్నాళ్లు డిప్రెషన్ మెయిన్ టెయిన్ చేసినా.. తర్వాత నార్మల్ మూడ్ లోకి వచ్చేశాడు.
అయితే నాగచైతన్య గురించి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆయన తండ్రి నాగార్జున బాటలోనే నడుస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా నాగచైతన్య రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నా ఇప్పటివరకు చైతూ స్పందించలేదు. అక్కినేని నాగార్జున మొదటి భార్య కుమారుడు నాగచైతన్య విడాకుల అనంతరం రెండో పెళ్లంటూ ఎన్నో సార్లు రూమర్స్ వచ్చాయి.
అయితే గత వారం రోజుల నుంచి మాత్రం నాగచైతన్య పై ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఇప్పటికే నాగచైతన్య శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన అందులో నిజం లేదని ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాగచైతన్యను రెండో పెళ్లికి నాగార్జున ఒప్పించాడని... ఈసారి నాగచైతన్య కూడా ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

నాగార్జున దూరపు బంధువుల అమ్మాయిని తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇన్ని వార్తలు వినిపించిన కూడా నాగచైతన్య ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇదే నిజమని భావిస్తున్నారు. మరి చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











