నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్.. మాయమైన సినిమాలన్నీ తీసుకొచ్చి ..

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎలాంటి సినిమా చేసినా కూడా ఇంతవరకు ఎవరు ట్రై చేయని విధంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కమర్షియల్ గానే ఆలోచిస్తు కంటెంట్ పూర్తిగా కొత్తగా ఉండాలని ఆలోచిస్తారు. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో కూడా నాగ్ ముందుంటారు. స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా ఇప్పటికి కొత్త దర్శకులతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే నాగార్జున త్వరలోనే ఒక ఓటీటీ డిజిటల్ వరల్డ్ ను క్రియేట్ చేయబోతున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అది కూడా చాలా కొత్తగా ఉండాలని అనుకుంటున్నారు. టాలీవుడ్ హిస్టరిలో ఎన్నో మంచి మంచి పాత సినిమాలు కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఏఎన్నార్ సినిమాలు కూడా యూ ట్యూబ్ లో లేవు. దీంతో నాగార్జున వాటిని వెతికే పనిలో పడ్డాడు.

Hero Akkineni nagarjuna new ott planning behind the secret

డిజిటల్ మ్యూజియం పేరుతో పాత సినిమా కలెక్షన్స్ అన్నిటినీ ఒక చోట చేర్చబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. నాగార్జున తన సన్నిహితుల ద్వారా కూడా పాత సినిమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారట. ఎలాగైనా ఎవరు చూపించని సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X