Allu Arjun: బాలీవుడ్ బడా డెరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్టును రిజెక్ట్ చేసిన బన్నీ..ప్రభాసే కారణం?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించడంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ బిజి బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు. దానితో పాటు.. ఓ బాలీవుడ్ బడా డైరెక్టర్ సినిమా కూడా చేయనున్నారట. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు బన్నీ నో చెప్పారట. దానికి కారణం ప్రభాస్ అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్.. ఒక్కసారిగా ఇండియావైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంంది. ఇక పుష్ప 2లో కూడా రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన వేర్ ఇజ్ పుష్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా.. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నారు బన్నీ. దానితో పాటు.. బాలీవుడ్ బాడా డైరెక్టర్ సినిమా చేయాల్సి ఉంది. కానీ తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ దర్శకుడికి బన్నీ నో చెప్పారట. ఆయన ఎవరో కాదు... ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా తెరకెక్కించిన బడా డెరెక్టర్ ఆధిత్య ధర్. ఆయన దర్శకత్వంలో బన్నీ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే సినిమా చేయాల్సి ఉంది. ఇది ఆ డెరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్టు.

ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమాను జియో స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా ఎంపిక అయ్యారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఏమైందో తెలియదు ఈ సినిమాకు బన్నీ నో చెప్పారట. దానికి కారణం ప్రభాస్ అని వినిపిస్తుంది. అదేంటి ప్రభాస్ కు, దీనికి సంబంధం ఏంటీ అనుకంటున్నారా... ప్రభాస్ కూడా ఈ మధ్య బాలీవుడ్ దర్శకులతో సినిమాలు తీయకూడదని నిర్ణయం తీసుకున్నారట.

ఆది పురుష్ దెబ్బకు ప్రభాస్.. బాలీవుడ్ దర్శకులకు నో చెప్పారని తెలుస్తోంది. అలా ప్రభాస్ బాటలోనే బన్నీ కూడా వెళ్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక్క ఓం రౌత్ చేసిన పనికి... బాలీవుడ్ దర్శకులకు ఛాన్స్ లు ఇవ్వకపోవడం ఏంటనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ మంచి పేరు, క్రేజ్ ఉన్నప్పుడు.. దానిని కాపాడుకోవాలంటే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని కొంత మంది అంటున్నారు.
ఇక ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ ప్రాజెక్టు విషయానికి వస్తే.. ఇది ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్టు. మొదట ఈ సినిమాలో విక్కి కౌషల్ ను అనుకున్నారట. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి. కానీ చివరకు అల్లు అర్జున్ అయితే కరెక్ట్ అని భావించారట. కానీ బన్నీ నో చెప్పారని తెలుస్తోంది. హిందూ ఇతిహాసం మహాభారతంలోని అశ్వత్థామ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఏ హీరోకు వరిస్తోంది చూడాలి.


Click it and Unblock the Notifications











