Mokshajna: కొడుకు కోసం ఏకంగా ఆమెను లైన్‌లో పెట్టిన బాలయ్య.. మామూలుగా ఉండదు మరి!
ఈ సినిమా ఇండస్ట్రీలోనైనా వారసత్వం ఉంటే.. ఈజీగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే ఎలాగో అలా ఎంట్రీ అయితే ఇస్తే సరిపోదు. దానికి తగ్గ అవుట్ పుట్ కూడా ఉండాలి. అలా వారసులుగా ఎంట్రీ ఇచ్చి... నిలదొక్కుకోలేక చాలా మంది సినిమాలు తీయడం ఆపేశారు. అయితే ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. అదే నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞను ఎప్పటి నుంచో లాంఛ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
కొడుకు ఎంట్రీ కోసం : నందమూరి బాలకృష్ణ.. తండ్రి ఎన్టీఆర్ సపోర్టుతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఆయన ప్రతిభ, నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆరు పదుల వయసులోనూ హీరోగా అదరగొడుతున్నాడు. అంతే కాదు కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ... సినిమాలు, బుల్లితెర షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు కొడుకు టాలీవుడ్ ఎంట్రీ కోసం.. బాలయ్య ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.

ఓ క్రేజీ న్యూస్ బయటకు : బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ఈ ఏడాది ఈ యువసింహం ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అందులోనూ ఈ మధ్య మోక్షజ్ఞ స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లోకి మారాడు. దీనితో ఆయన మూవీ కన్మార్మ్ అని అభిమానులు ఖుష్ అవుతున్నారు. అయితే ఇదిలా ఉంటే మోక్షజ్ఞ మూవీ కోసం ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

బోయపాటి దర్శకత్వంలో : అదేంటంటే... మోక్షజ్ఞ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే ఆ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు అని తెలుస్తోంది. మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ రంగంలోకి దిగి మరి ఓ హీరోయిన్ ను సెలెక్ట్ చేశారని సమాచారం. ఆ హీరోయిన్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజి బిజిగా ఉంది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంటోంది. టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తున్న ఆ హీరోయిన్ ఇప్పుడు మోక్షజ్ఞ పక్కన చేయనుందని టాక్ వినిపిస్తోంది.

శ్రీలీలతో మోక్షజ్ఞ : ఆమె ఎవరో కాదు.. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న శ్రీలీల. ఈ హీరోయిన్.. మోక్షజ్ఞ హైటుకు, వెయిట్ కు.. పర్ఫెక్ట్ మ్యాచ్ అని... ఈ నిర్ణయం తీసుకున్నారట బాలయ్య. ఇప్పటికే బాలయ్య సినిమాలో నటిస్తున్న ఈ భామ.. త్వరలో బాలయ్య కొడుకుతో కూడా నటించబోతుందని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి కొడుకు కోసం భలే అమ్మాయిని సెలక్ట్ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











