అల్లు అర్జున్ పెళ్లిలో ఘోరంగా అవమానింపబడ్డ బాలకృష్ణ...!
ఆయనకు సింహా, నరసింహా, లక్ష్మీనరసింహా, ఎన్ని పేర్లు ఉన్నా బాలయ్యకు మాత్రం అవమానం జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన బన్నీ పెళ్లి వేడుకలో అగ్రహీరో బాలయ్యకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. వివిఐపిలు, విఐపిలు, సన్నిహితులు, అభిమానులు ఇలా వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు ఎంట్రన్సులు ఏర్సాటు చేశారు.
అయితే విఐపిలు లేదా సన్నిహితులకు కేటాయించి ఎంట్రన్స్ ద్వారా రావాల్సిన బాలయ్య వివిఐపి గేట్ ద్వారా లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ (వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి)సిబ్బంది మేకప్ లేని బాలయ్యను గుర్తుపెట్టకుండా ఎవరో బయటి వ్యక్తి అనుకుని అడ్డుకున్నారు. దీంతో చిర్రెత్తిన బాలయ్య 'నన్నే అపుతారా?"ఎంత దైర్యం నీకు అంటూ వారితో వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించి కొందరు సెక్యూరిటీకి అసలు విషయాన్ని చెప్పిలోనికి పంపించేశారట.
ఇంటర్నెట్ లో మెగా అభిమానులు బాలయ్యను కించ పరుస్తున్న విషయం తెలిసి కసిమీద ఉన్న బాలయ్య ఫ్యాన్స్..తాజాగా బాలయ్యకు మరోసారి అవమానం జరిగిందన్న విషయం తెలుసుకుని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











