Balayya Mokshagna: బాక్సులు బద్దలయ్యే న్యూస్... రా అండ్ రస్టిక్ డైరెక్టర్‌తో నందమూరి మోక్షజ్ఞ లాంచ్
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ గురించి రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఆయన ఎంట్రీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మోక్షజ్ఞను లాంచ్ చేసేది వేరే దర్శకుడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకు కూడా ఆ డెరెక్టర్ కథ నచ్చడంతో.. మోక్షజ్ఞను ఆ రా అండ్ రస్టిక్ డైరెక్టర్ తోనే లాంచ్ చేయాలని చూస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై నిత్యం ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే మొదట బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని మొదట్లో వార్తలు వచ్చాయి. కథ కూడా ఓకే అయినట్లు అన్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య ఏరీ కోరి శ్రీలీలను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండబోతుందని అన్నారు. ఆయన కథకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కానీ ఇప్పుడు తెరపైకి మరో దర్శకుడి పేరు వచ్చింది. ఆయన ఎవరో కాదు.. రా అండ్ రస్టిక్ పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదేల. సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంద్ ఓదెల మొదటి సినమా దసరా. ఇక మొదటి చిత్రంతోనే... సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు శ్రీకాంత్.

ఇక మోక్షజ్ఞ కోసం శ్రీకాంత్ ఓదెల ఓ కథ సిద్ధం చేసుకున్నారట. అది బాలయ్యకు వినిపించారని తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతో... బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడితోనే లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీ... బాలయ్య తీయబోయే ఆదిత్య 999 సినిమాలో ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో.. తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇక మోక్షజ్ఞ కూడా డ్యాన్స్, నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే సన్నబడి.. హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇదంతా సినిమా ఎంట్రీ కోసమే అని తెలుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞకి 28 ఏళ్ళు వచ్చేశాయి. ఈ టైంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. కరెక్ట్ గా ప్రేక్షకులకు రీచ్ అవుతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి మోక్షజ్ఞ ఎప్పుడూ లాంచ్ అవుతాడో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది అతని టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అని తెలుస్తోంది.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కూతురి పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా.. ఆగస్టు 17న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా, పూరీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











