Chiyaan Vikram: ఒక్కసారిగా రెమ్యునరేషన్‌ను రెండింతలు చేసిన విక్రమ్, ప్రస్తుతం ఎన్ని కోట్లు తీసుకుంటున్నారంటే?

చియాన్ విక్రమ్.. విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించగల సత్తా ఉన్న హీరో. ఈయన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విక్రమ్ హీరోగా చేసిన ప్రతీ సినిమా ఓ ప్రయోగమే. ఆయన చేసే సినిమాల్లో ఆయన పాత్రలన్నీ వేరు వేరుగా ఉంటాయి. ఒకదానితో మరొకదానికి ఏమాత్రం పోలిక ఉండదు. స్టైల్ కూడా పూర్తిగా మార్చేస్తుంటారు. ఈయన తమిళ హీరోనే అయినప్పటికీ.. తెలుగులోనూ ఈయన ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఈయన 1993లో అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు చియాన్ విక్రమ్. ముఖ్యంగా 2003లో వచ్చిన శివపుత్రుడు సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. అందులో విక్రమ్ పాత్రకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఎంతో అందంగా కనిపించే విక్రమ్ ఆ సినిమా కోసం డీగ్లామరస్ గా కనిపించారు. అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయారు. ఆ తర్వాత అపరిచితుడు, మల్లన్న, రావణ్, నాన్న, తాండవం, ఐ వంటి చిత్రాలతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. విక్రమ్ మార్కును ఈ సినిమాలన్నింటిలో మనం చూడవచ్చు.

Hero Chiyaan Vikram Doubled His Remunaration For Next Movie

అయితే తాజాగా ఈయన తంగలాన్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా చియాన్ విక్రమ్ అద్భుతమైన డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. కేజీఎఫ్ గా పేరొందిన కోలార్ బంగారు గనిలో పని చేసిన కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన మాళవిక మోహనన్ నటించింది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించగా.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుండగా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 26వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Hero Chiyaan Vikram Doubled His Remunaration For Next Movie

ఇదంతా ఇలా ఉండగా.. హీరో విక్రమ్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తంగలాన్ కోసం 23 కోట్ల పారితోషికం అందుకున్న ఈయన.. 2022లో విడుదలైన కోబ్రా సినిమా కోసం 25 కోట్ల వరకూ పుచ్చుకున్నారట. అయితే తంగలాన్ సినిమాకు కాస్త తక్కువగానే తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను డబుల్ చేశారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. తంగలాన్ హిట్టు అయితే కచ్చితంగా ఆయన రెమ్యునరేషన్ డబుల్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.

Hero Chiyaan Vikram Doubled His Remunaration For Next Movie

ముఖ్యంగా చియాన్ విక్రమ్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నారట. అందులో తాను నటించేందుకు గాను ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని అంతా అనుకుంటున్నారు. సినిమాలో పాత్రను, తన ప్రాధాన్యాన్ని బట్టి విక్రమ్ పారితోషికం తీసుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితన తన తదుపరి చిత్రానికి ఏకంగా 50 కోట్లు అడిగాడంటే.. ఆ సినిమాలో తన పాత్ర కూడా అదే రేంజ్ లో ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. చూడాలి మరి అసలు ఏం జరగబోతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X