హీరో అత్యాశ.. హిట్టు కొట్టడంతో అమాంతం రెమ్యునరేషన్ పెంపు.. సరేనని ఇస్తే ఇప్పుడేమో?

సినీ పరిశ్రమలో దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఉపయోగపడినంత బాగా మరే సామెత ఉపయోగపడదు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే క్రేజు ఉన్నప్పుడే దానిని వాడుకోవాలి క్రేజు తగ్గిపోయాక ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. అయితే క్రేజ్ వచ్చింది కదా అని ముందు చెప్పిన దానికంటే ఒక హీరో భారీ ఎత్తున డిమాండ్ చేసిన అంశం ఇప్పుడు తాజాగా తెరమీదకు వచ్చింది. అసలు ఏంటా కధ ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

వెనక్కి తగ్గడు

వెనక్కి తగ్గడు

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సదరు హీరో చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డాడు. అయితే ఎన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా ఆయన రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గడు అని టాలీవుడ్ వర్గాలు అందరికీ తెలుసు. అయితే ఫ్లాపులు పడుతున్నా ఆయన మార్కెట్ కాస్త బెటర్ గా ఉండటంతో దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేవారు.

అనూహ్యంగా

అనూహ్యంగా

అలా ఫ్లాపుల్లో ఉన్న సమయంలో వరుస సినిమాలు ఒప్పుకుంటున్న ఆయన ఒక సినిమా చూసేందుకు గాను 7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. నిర్మాత కూడా కొన్ని లెక్కలు వేసుకుని వర్కౌట్ అవుతుంది అనుకుని రంగంలోకి దిగారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే సదరు హీరో నటించిన మరో సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

మరో దారి లేదట

మరో దారి లేదట

హమ్మయ్య ఇక మన సినిమాకి కూడా ఇంకా మార్కెట్ పెరిగే అవకాశం ఉందని సదరు నిర్మాత ఆనందపడే లోపు హీరోగారు షాక్ ఇచ్చారు. అదేమిటి అంటే హీరో అత్యాశతో సినిమా పూర్తి చేయాలి అంటే తన రెమ్యునరేషన్ 11 కోట్ల రూపాయలు అని మిగిలిన నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే గాని సినిమా పూర్తి కాదు అని కండిషన్ పెట్టాడట. నిర్మాత ఈ కొత్త కండిషన్ అంగీకరించడం తప్ప మరో దారి దొరకలేదట.

లాభాలు ఎక్కువగా రావడంతో

లాభాలు ఎక్కువగా రావడంతో

ఎందుకంటే ఈ నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే కానీ డబ్బింగ్ కూడా చెప్పను అంటూ హీరోగారు షాక్ ఇచ్చారట. నిర్మాత ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో హీరో అడిగింది ఇచ్చేశారట. అయితే హీరోకి గత సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన మార్కెట్ కూడా గట్టిగా జరిగింది. ఈ నేపథ్యంలో అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువగా రావడంతో నిర్మాత హీరో కి చెప్పిన దానికంటే హీరో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారట.

Recommended Video

SS Rajamouli Graces Launch Of Gali Janardhan Reddy’s Son Kireeti’s Film | Filmibeat Telugu
డిజాస్టర్ టాక్

డిజాస్టర్ టాక్

ఇప్పుడు అదే ఆయన చేసిన తప్పు గా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హీరో ఏమో దానికి కారణం సినిమా దర్శకుడు అని నిర్మాత సెట్స్ పైకి రాకుండా ఉండడం వల్లే ఇదంతా జరిగిందని సన్నిహితులతో పేర్కొన్నట్లు సమాచారం. హీరో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాం ఇప్పుడు ఏంటి ఇలా జరిగింది అని సదరు నిర్మాత తల పట్టుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X