విలన్‌గా మంచు మనోజ్.. ఆ ఇద్దరు టాప్ హీరోలను ఢీకొట్టే పాత్రలో.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి గొప్ప పేరు ఉంది. మంచు మోహన్ బాబు సుమారుగా 600 చిత్రాలకుపైగా నటించడమే కాకుండా 50 చిత్రాలను నిర్మించిన ఘనత కూడా ఆయనకు ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి సినీ తెరకు ఆయన వారసులు మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ టాలీవుడ్‌కు పరిచయమై తమకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. అయితే ఇప్పటి వరకు హీరోగా రాణించిన మనోజ్ ప్రస్తుతం విలన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమంలో మంచు మనోజ్ నటనకు, డైలాగ్ డెలివరీకి అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌లో విభిన్నమైన చిత్రాలు, విలక్షణ పాత్రలతో ఆకట్టుకొన్నాడు. అయితే వరుస పరాజయాలు, వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటన కారణంగా యాక్టింగ్‌కు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

Hero Manchu Manoj to turns Villain for Hanuman fame Teja Sajja and Dulquer Salman of Karthik Gattamaneni Movie

రాజకీయ నేపథ్యం ఉన్న భూమా మౌనిక‌ను ఇటీవలే వివాహం చేసుకొన్నారు. రెండో పెళ్లి తర్వాత ఆయన మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ప్రొఫెషనల్‌గా కొత్త భూమికను పోషించే విధంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకొంటున్నారు. ఆ క్రమంలో టెలివిజన్, ఓటీటీ, సినీ రంగాల్లోకి మరోసారి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఇటీవల టెలివిజన్, డిజిటల్ రంగంలోకి ప్రవేశించి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఓ క్రేజ్‌ను సంపాదించుకొన్నారు. అయితే సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఎప్పుడని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు శుభవార్తను అందించారు. అయితే హీరోగా కాకుండా ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Hero Manchu Manoj to turns Villain for Hanuman fame Teja Sajja and Dulquer Salman of Karthik Gattamaneni Movie

ఇదిలా ఉండగా, ప్రముఖ నిర్మాణ సంస్ణ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్టులో మంచు మనోజ్ భాగం కానున్నారు. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొన్న తేజా సజ్జా హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఈగల్ డైరెక్టర్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X