For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ తో పోటీగా ‘దేనికైనా రెడీ' అంటున్నాడు

  By Srikanya
  |

  హైదరాబాద్ : మంచు విష్ణు, జి.నాగేశ్వరరెడ్డి కంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అప్పుడు 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రం అక్టోబర్ 11 న విడుదల తేదీ ప్రకటించి ఉన్నారు. దాంతో పవన్ తో ఈ సినిమా పోటీ పడుతుందా అని చాలా మంది మాట్లాడుకున్నారు. అయితే తర్వాత పవన్ సినిమాని అక్టోబర్ 18కి వాయిదా వేసారని తెలుస్తోంది. దాంతో మంచు విష్ణు సినిమాని సైతం అక్టోబర్ 18కే వాయిదా వేసారు. దాంతో ఈ రెండు సినిమాల విడుదల తేదీలు గమనిస్తూ వస్తున్న వారు ఆశ్యర్యానికి లోనవుతున్నారు.

  ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికి మూడు పాటలు షూట్ పూర్తైంది. ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

  పవన్‌కళ్యాణ్‌, తమన్నా జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్సల్‌ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతి ష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాకీపార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుం టోంది. ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ''ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పద్మాలయా స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈనెల 20 వరకు బ్యాలెన్స్‌ ఉన్న రెండు పాటల్ని కూడా భారీ సెట్స్‌లో చేస్తున్నాం. దీంతో మొత్తం షూటింగ్‌ పూర్తవ్ఞతుంది. సినిమాకే హైలైట్‌గా నిలిచేవిధంగా ఈ పాటలుంటాయి అన్నారు.

  అలాగే పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచేవిధంగా ఈ సినిమా ఉంటుంది. దర్శ కుడు పూరి జగన్నాథ్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందాల తార తమన్నా తన అందచందాలు, గ్లామర్‌తో ప్రేక్షకులను మురిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే చిత్రమిది. పూర్తి వినోదాన్ని పంచే ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇక ఈనెల మూడో వారంలో ఆడియో విడుదలచేసి అక్టోబర్‌ నెలలో ప్రపంచవ్యాప్తంగా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాంఅని అన్నారు. పవన్‌కళ్యాణ్‌, తమన్నా, గేబ్రియల్‌, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావ్ఞ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, నిర్మాణం: యూనివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  Manchu vishnuvardhan Babu latest venture ‘Denikainaa Ready’, some days ago, was planned to be released on 8th October. Some of the cine folks, got surprised of his daring attempt, as he had to face Pawan Kalyan’s ‘Cameraman Gangatho Rambabu’, as it was supposed to be released on 11th October, earlier. Meanwhile, CGR has been postponed to 18th October. Similarly, ‘Denikainaa Ready’ has also been postponed to the same date as CGR is releasing. The movie is being made under 24 Frames Factory.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X