Hero కథను రిజెక్ట్ చేసిన ఆ హీరో.. అలా చేంజ్ చేయడంతో ఒప్పుకున్న మహేష్ మేనల్లుడు

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, నరేష్, కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటీనటులు ఉన్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు కూడా నమ్మకంతో ఉన్నారు.

ఇక సినిమా ట్రైలర్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటోంది. హీరో సినిమా ట్రైలర్ చూడగానే ఆ కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. హీరో కావాలని ప్రయత్నాలు చేసే ఒక కుర్రాడు అనుకోకుండా ఒక క్రైమ్ లో చిక్కుకొని ఎలా బయటపడ్డాడు అనేది మెయిన్ స్టోరి. ఇక సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ తరహాలోనే తెరకెక్కించినట్లు చెబుతున్నారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని కూడా అంటున్నారు. కామెడీ లవ్ రొమాన్స్ డోస్ కూడా గట్టిగానే ఉంటుందట. ఇక యాక్షన్ అంశాలు కూడా గట్టిగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది.

 Hero movie story rejected by young hero

ఇక సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హీరో సినిమా కథను మొదట యువ హీరో నితిన్ కు చెప్పినట్లు సమాచారం. నితిన్ ఈ కథను తన సొంత హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లోనే నిర్మించాలని అనుకున్నాడట. కానీ ఏమైందో ఏమో గాని మళ్ళీ ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే క్యాన్సిల్ అయ్యింది. నితిన్ తో మరో కథపై చర్చలు జరుపుతుండగా శ్రీరామ్ ఆదిత్యకు మరో ఛాన్స్ వచ్చింది. అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేయాలని చెప్పడంతో మళ్ళీ ఎప్పటిలానే హీరో కథను చెప్పారట.

కథ నచ్చింది గాని అశోక్ గల్లాను మాస్ ఎలివేషన్స్ తో ఇంకా యాక్షన్ లుక్ లో చూపించాలని చెప్పడంతో శ్రీరామ్ కౌ బాయ్ ఎపిసోడ్ తో పాటు మరికొన్ని పాయింట్స్ ను చేంజ్ చేసి చెప్పాడట. మొత్తంగా సినిమా కథ నచ్చడంతో అశోక్ వర్కౌట్స్ చేసి తన బాడీని కూడా చేంజ్ చేశాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 13న నిర్వహించనున్నారు. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక సినిమా జనవరి 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక హీరో సినిమా విడుదల అనంతరం అశోక్ గల్లా వెంటనే మరొక ప్రాజెక్ట్ ను మొదలు పెట్టె అవకాశం ఉందట. ఇక ఆ కొత్త ప్రాజెక్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X