నిర్మాతలతో నాగ శౌర్య గొడవ, కారణం ఇదేనా, సాయి పల్లవి, శౌర్య మధ్య ఏముంది?
Recommended Video

'ఫిదా', 'ఎంసిఎ' వంటి సినిమాల్లో నటించిన సాయిపల్లవి, నాగ శౌర్య జంటగా ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైౖకా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. శ్యాం సి.ఎస్. సంగీత సారధ్యం వహించారు. నాగ శౌర్య ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు, కారణం అదే అనుకుంటున్నారు అందరు.

హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో..
ఫిధా సినిమాతో అందరిని ఫిధా చేసిన హీరోయిన్ సాయి పల్లివి నటించిన తాజా సినిమా ఏంసిఏ పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ హీరోయిన్ కు ఒక్క సినిమాతో మంచి పేరు లభించింది. తాజాగా ఈ హీరోయిన్ నటించిన సినిమా కణం. ఈ శుక్రవారం కణం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మీడియాతో మాట్లాడడం జరిగింది.

నాగ శౌర్య పై సాయి పల్లవి కామెంట్స్..
నాగశౌర్య అయితే ఓపెన్ గానే సాయిపల్లవిపై విమర్శలు చేసాడు. ప్రతీసారి సెట్ కు ఆలస్యంగా వస్తుందని గతంలో నాగ శౌర్య తెలియజేసాడు. దాంతో పల్లవి ఇప్పుడు ఆ ఇష్యూపై నోరు విప్పింది. అలా ఎప్పుడు జరగలేదని తెలియజేసింది. కణం సినిమా ప్రమోషన్స్ కు నాగ శౌర్య రావడం లేదని ప్రశ్నించగా నాగ శౌర్య అసలు తన కాల్ లిఫ్ట్ చెయ్యలేదని హీరోయిన్ సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించడం గమనార్ధం.

వివరణ ఇచ్చిన సాయి పల్లవి..
కణం సినిమా గురించి సాయి పల్లవి మాట్లాడుతూ... సెట్ లోకి వచ్చిన తర్వాత డైరెక్టర్ ను తన పాత్ర గురించి పదే పదే అడుగుతానని అందుకే నాగ శౌర్య తన గురించి అపార్థం చేసుకొని ఉండొచ్చని చెప్పంది సాయిపల్లవి. నాగ శౌర్యతోనే కాదు ఎవరితోనూ తనకు గొడవలు లేవని క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. కాని నాగ శౌర్య కణం సినిమా ప్రమోషన్స్ కు ఎందుకు రావడం లేదనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు.

వీరి గొడవలు అందుకేనా...
తాజాగా వినిపిస్తున్న వార్తా ప్రకారం... కణం సినిమా షూటింగ్ సమయంలో సాయి పల్లవి, నాగ శౌర్య మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్ర నిర్మాతలతో నాగ శౌర్య కొన్ని విషయాల్లో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కారణాలు పూర్తిగా తేలినప్పటికీ లైకప్రొడక్షన్స్ తో నాగ శౌర్య సరిగా లేడని ఒక వాదన. అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ లో పాల్గొనడంతో హీరో , నిర్మాతల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











