twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విలన్ గా చేస్తున్న హీరో నాని?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకున్న హీరో నాని. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని నెగిటివ్ రోల్ చేస్తున్నాడని సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.

    ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా' చిత్రంలో నటిస్తున్న నాని ఈ చిత్రంతో పాటు 'శంభో శివ శంభో' ఫేమ్ సముద్రఖని రూపొందిస్తున్న ద్విభాషా చిత్రం 'జెండాపై కపిరాజు'లో నటిస్తున్నాడు. ఇందులో తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం.

    నాని మాట్లాడుతూ.... సముద్రకని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నా . నా కెరీర్‌లో సవాల్‌తో కూడుకున్న పాత్ర ఇదే. ప్యాక్‌ బాడీ కంటే ఎక్కువ కష్టపడాల్సిన ఓ ఎపిసోడ్‌ ఇందులో ఉంది అన్నారు. నాని, అమలపాల్ హీరో హీరోయిన్లుగా పి. సముద్ర‌ఖని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వాసన్స్ విజువల్ వెంచర్స్ సమర్పణలో కె.ఎస్. శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ప్రతి రోజు మన చుట్టూ జరిగే సమస్యలను ప్రస్తావిస్తూ ఈచిత్రం ఉంటుంది, మనల్ని సరిదిద్దుకుంటే ప్రపంచం అంతా సరిదిద్దుకుంటుంది అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఒక మంచి సందేశాత్మక చిత్రంగా ఈమూవీ ఉంటుందన్నారు.

    హీరో నాని మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెల కంటి, ఫోటోగ్రఫీ: ఎన్. సుకుమార్, సంగీతం: జి.వి.ప్రకాష్, లిరిక్స్: అనంత శ్రీరామ్, ఆర్ట్: జాకీ, ఎడిటింగ్: ఎస్.ఎస్. ఫాజిల్, నిర్మాత కె.ఎస్. శ్రీనివాసన్, దర్శకత్వం: పి. సముద్రఖని.

    English summary
    Here Nani, the boy-next-door of Tollywood, seems to be not scared of trying out of the box. He is all set to play a character with negative shades in his upcoming film 'Jendapai Kapiraju'. He will be seen for the first time in his career in a dual role including one with negative shades - A 27-year-old and a 45-year-old.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X