డబ్బుకు ఆశ పడకుండా అడుగులు వేస్తున్న నవీన్ పొలిశెట్టి.. ఇప్పటివరకు ఎన్ని రిజెక్ట్ చేశాడంటే..?

టాలెంట్ ఉన్న నటీనటులకు బ్యాక్ గ్రౌండ్ ఏ మాత్రం అవసరం లేదని కష్టపడితే ఎప్పటికైనా విజయం అందుకోవచ్చని నవీన్ పొలిశెట్టి నిరూపించాడు. ప్రస్తుతం యంగ్ జనరేషన్స్ కు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ యువ హీరో జాతిరత్నాలు సినిమాతో ఏ స్థాయిలో హిట్టు కొట్టాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా అనంతరం నవీన్ కు గ్యాప్ లేకుండా ఆఫర్స్ వస్తున్నాయట.

వైజయంతి బ్యానర్ లో..

వైజయంతి బ్యానర్ లో..

వైజయంతి ప్రొడక్షన్ వారి స్వప్న సినిమాస్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక పిట్టగోడతో డిజాస్టర్ అందుకున్నప్పటికి దర్శకుడు అనుదీప్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి హిట్టు కొట్టారు.

అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు..

అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు..

7కోట్ల లోపే అతి చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 50కోట్లకు పైగా వసూళ్లను అందుకొని నిర్మాతకు భారీ స్థాయిలో లాభాలను అందించింది. ఇక సినిమా హిట్టవ్వడంతో హీరో అనుదీప్ కు కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అడ్వాన్స్ లు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కానీ ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా నవీన్ ఒప్పుకోవడం లేదట.

ఎన్ని రిజెక్ట్ చేశాడంటే..

ఎన్ని రిజెక్ట్ చేశాడంటే..

జాతిరత్నాలు హిట్టయిన తరువాత ఎన్నో ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో దిల్ రాజు, మహేష్ బాబు కూడా ఫోన్ చేసి మరీ వారి ప్రొడక్షన్ లో సినిమా చేయమని అడిగారని వార్తలు వచ్చాయి. అయితే నవీన్ ఫుల్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యే వరకు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకోవడం లేదట. 20కి పైగా రిజెక్ట్ చేసిన నవీన్ కేవలం రెండు కథలపై ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అనుష్కతో ప్రేమ కథ

అనుష్కతో ప్రేమ కథ

ఒక సినిమా కథ మొత్తం సెట్టయిన తరువాతే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడట. ఇక ఈ హీరో ప్రస్తుతం అనుష్కతో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో 20ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ.. 40ఏళ్ళ వయసులో ఉన్న అనుష్క పాత్రతో ప్రేమలో పడతాడట. ఎమోషనల్ కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఆ సినిమాను 'రారా కృష్ణయ్య' దర్శకుడు మహేష్ తెరకెక్కించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X