నయనతార కోసం రాత్రంతా మందుకొట్టిన హీరో...
పాపం ఆ హీరోకు మొన్న మంగళవారం రాత్రంతా నిద్ర లేదు. అందులోనూ నిద్ర ఆపుకోవాలని మందు సిట్టింగ్ పెట్టి మరీ కాపుకాచాడు. ఇంతకీ ఎవరి కోసం అంటే..నయనతార కు ముందుగా తను పుట్టినరోజు విషెష్ చెప్పాలని ఆయనగారి ఉద్దేశ్యంట. దాంతో పన్నెండు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూసి చేసాడు. అయితే అప్పటికే ఆమె ఫోన్ బిజీ అయిపోయింది. కంటిన్యూ ఎంగేజ్. హీరోలు, సాటి హీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలు... ఇలా అందరూ ఆమెకు విషెస్ చెప్పాలని ఉత్సాహపడటం సహజం. అందులోనూ ఒక భాషలో కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన నయనతారను విష్ చేయాలనుకునేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అందుకే ఆమె ఫోన్ ఒకటే పనిగా మోగుతూ ఉందట. ఇక ప్రభుదేవా ఫోన్... వాటిల్లో స్పెషల్.
ఇక ఎంతకీ ఫోన్ దొరక్క ఎక్కింది దిగిపోయి... ఏం చేయాలో అర్ధంకాక దాదాపు రెండు గంటలు ఎదురు చూసి అప్పుడు ఆమెకు విషెష్ చెప్పాడుట. ఆ హీరో పేరు ఎందుకు కానీ ఫిల్మ్ సర్కిల్స్ లో ఆ హీరో గురించి విచిత్రంగా చెప్పుకుంటున్నారు. నయనతార అంటే అంత అభిమానమా అని షాకవుతున్నారు. ఇక నయనతారకూ మొన్న మంగళవారంఆ రాత్రి పాపం అస్సలు నిద్రపోనీయలేదట. కారణం సెల్ ఫోన్ ఆగకుండా మ్రోగటమే. దానికి కారణం మరేదో కాదు..తెల్లారితే ఆ ముద్దుగుమ్మ పుట్టినరోజు. దాంతో ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని చాలా మంది ఎదురు చూసి రింగ్ చేసారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇంతలా హంగామా జరగలేదుట. సినిమాలు తక్కువ ఉన్నా తనకు ఫోన్ చేసే అబిమాన సినీ జనం ఎక్కువ మంది ఉన్నందుకు హ్యాపీ ఫీలయిందిట.
ఇక ఈ మ్యాటర్ ప్రక్కన పెడితే ఆ రోజు రాత్రి చాలా సింపుల్‌గా తన బర్త్‌డేను జరుపుకుంది. కొంతమంది స్నేహితుల మధ్య ఆ రాత్రి కేకును కట్ చేశారు నయనతార. బుధవారం సాయంత్రం కూడా అతికొద్ది మందితో కలిసి డిన్నర్‌లో పాల్గొన్నారు నయనతార. "అన్ని రోజుల్లాగానే ఈ రోజు కూడా గడిచింది, అంతకుమించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు' అని అంటున్న నయనతార... తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు. ఇక ప్రస్తుతం నయనతార ఎన్టీఆర్ సరసన అదుర్స్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. కొత్తగా ఏ చిత్రాలు కమిట్ కాలేదు. అదుర్స్ చిత్రం డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











