మహేశ్ బాబు సినిమా తీస్తే.. నిఖిల్ కు రూ.150 కోట్ల లాభం.. ఎలాగంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చివరిగా బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన 'గుంటూరు కారం'తో అలరించిన విషయం తెలిసిందే. గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం బాబు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, మన జక్కన్న దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు సినిమాతో.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థకు చాలా లాభం చేకూరిందనే న్యూస్ ఒక్కటి ఆసక్తికరంగా మారింది.

అదే మూవీనో కాదు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'ఖలేజా'నే కావడం విశేషం. 2010లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఎందుకో పెద్దగా ఆడలేదు. కానీ మహేశ్ బాబు అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకులు మాత్రం ఖలేజా చిత్రాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో తెలిసిందే. మహేశ్ బాబు కామెడీ టైమింగ్ ఈ చిత్రంలో వేరే రేంజ్ లో ఉంటుంది. అయితే.. ఈ చిత్రానికి నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తీకేయ'కు సంబంధం ఉందని తాజాగా తెలిసింది. నిఖిల్ తో 'కార్తీకేయ' చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.

Hero Nikhil Siddhartha Benefit from Mahesh Babu Movie Interesting Details Here

కాగా.. చందూ మొండేటి కెరీర్ కు మంచి స్టార్ ఇచ్చిన చిత్రం 'కార్తీకేయ'. అయితే ఈ సినిమా మహేశ్ బాబు 'ఖలేజా' నుంచే పుట్టిందంట. 'ఖలేజా'నుంచి స్ఫూర్తి పొంది 'కార్తీకేయ అండ్ కార్తీకేయ 2' చిత్రాల కథలను డెవలప్ చేశారంట చందూ మొండేటి. గురూజీ 'ఖలేజా'తో హిట్ అందుకోలేకపోయినా.. చందూమొండేటి ఇన్ స్పైర్ అయ్యి రాసిన 'కార్తీకేయ, కార్తీకేయ 2' కథలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాదు.. నిఖిల్ సిద్ధార్థ ఈ రెండు చిత్రాల నుంచి బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

అలా మహేశ్ బాబు 'ఖలేజా' సినిమా తీయగా.. నిఖిల్ 'కార్తీకేయ' సిరీస్ లకు దారి పడిందంటున్నారు. ఏదేమైనా నిఖిల్ కెరీర్ 'కార్తీకేయ' తర్వాత స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ కాబోతున్నాడు. నెక్ట్స్ నిఖిల్ సిద్ధార్థ నుంచి 'స్వయంభు', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ది ఇండియా హౌజ్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్క్ టైటిల్ తో ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

Hero Nikhil Siddhartha Benefit from Mahesh Babu Movie Interesting Details Here

ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్లతో షూటింగ్ కొనసాగుతోందని తెలుస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్ కు వస్తూ వెళ్తూ ఉంటోంది. ఎస్ఎస్ఎంబీ29 సెట్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి వెళ్లకుండా జక్కన్న సెక్యూరిటీని టైట్ చేశారంట. మరోవైపు సెట్స్ లో పనిచేసేవారికి స్ట్రిక్ట్ రూల్స్ వర్తింపచేస్తూ పలు డాక్యుమెంట్లపై సైన్లు కూడా తీసుకుంటున్నారంట. భద్రతా దృష్ట్యా ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X