Nithiin: నితిన్‌ను రాబిన్ హుడ్‌గా మార్చిన యంగ్ డైరెక్టర్.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు ఇవే!
హీరో నితిన్ హిట్ కొట్టక చాలా కాలమే అవుతుందని చెప్పాలి. ఇటీవల వక్కంతం వంశీతో కలిసి ఎక్స్ ట్రా ఆర్డీనరి మ్యాన్ గా వచ్చిన ఫలితం దక్కలేదు. దీనితో ఈ కుర్ర హీరో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్నాడు. భీష్మ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రాజెక్ట్ డీటైల్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో ఇప్పటికే భీష్మ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షంతో పాటు.. నితిన్ కెరియర్లో సూపర్ హిట్టుగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ హిట్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్న నితిన్ మరోసారి వీరు కలిసి ఓ కొత్త సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్.

భీష్మ కాంబో రిపీట్ అవుతుండగా.. ఆ సినిమా కంటే ఈ సినిమా ఫలితం ఇంకా ఎక్కువ రేంజులో ఉండేందుకు వెంకీ కుడుముల ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఇక భీష్మ సినిమాలో నితిన్ క్యారెక్టర్ మీమర్. ఇక ఓ కంపెనీకి సీఈఓ అవుతాడు.. ఇక నితిన్ కొత్త సినిమా విషయానికి వస్తే జనాలను బురిడీ కొట్టించే మోసగాడిగా హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. గిఫ్ట్స్ ఇచ్చే సీజన్ ముగిసింది. త్వరలో దోచుకునే సీజన్ మొదలు అవుతుందంటూ మేకర్స్ ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
జనవరి 26న ఉదయం 11.07 గంటలకు మోసగాడి ముఖాన్ని మీకు చూపిస్తామంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. నితిన్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ వివరాలపై అప్డేట్ ఇచ్చింది. అయితే టైటిల్ కూడా ఆరోజే రివిల్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ ను రాబిన్ హుడ్ అని పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇక రాబిన్ హుడ్ తరహాలోనే... జనాల నుంచి సొమ్మును కాజేసే క్యారెక్టర్ లో హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా.. పవన్ కల్యాణ్ కు నితిన్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. పవన్ నటిస్తున్న చిత్రాల్లో హరి హర వీరమల్లు చిత్రం ఒకటి. ఆ చిత్రం కూడా రాబిన్ హుడ్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇప్పుడు నితిన్ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం విశేషం. ఎంతైనా నితిన్ పవన్ ఫ్యాన్ అనిపించుకుంటున్నాడు అని నెటిజన్స్ అనుకుంటున్నారు.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే... నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. ఇక ఈ సినిమను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా... నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ జంట ఇటీవల ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











