ప్లాన్ చేంజ్ చేసిన నితిన్.. సంక్రాంతి కంటే ముందుగానే..

వరుస డిజాస్టర్స్ కారణంగా దాదాపు ఏడాది వరకు వెండితెరకు దూరమైన యంగ్ హీరో నితిన్ మొత్తానికి ఆలస్యంగా వచ్చినప్పుటికీ భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఇక నుంచి తొందరపడకుండా వీలైనంత వరకు కూల్ గా సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ రావాల్సిన రంగ్ దే సినిమాపై నితిన్ త్వరలోనే ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా సంక్రాంతికి రానున్నట్లు మొదట్లో అనేక రకాల కథనాలు వచ్చాయి. చిత్ర యూనిట్ కూడా అదే ప్లాన్ వేసుకుంది. ఇక ఇప్పుడు నితిన్ ఇంకాస్త అడ్వాన్స్ గా ఆలోచించి ముందే రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Hero nithiin plans changes on upcoming movie rang de

డిసెంబర్ క్రిస్టమస్ సందర్భంగా సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి రంగ్ దే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ కి ఇటీవల రెస్పాన్స్ కూడా గట్టిగానే వచ్చింది. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయనుంది చిత్ర యూనిట్. సినిమా రిజల్ట్ పైన అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. మరి సంక్రాంతి నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అవుతున్న రంగ్ దే ఎలాంటి బాక్సాఫీస్ కలెక్షన్స్ ని వసూలు చేస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటు క్రిస్టమస్ కి మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X