పవన్ ఫ్యాన్స్ ని మస్త్ ఖుషీ చేస్తున్న ప్లాప్ హీరో...!

By Sindhu

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'తీన్ మార్" ఆడియో వేడుక ఈ రోజు (21.3.11)శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మా మూవీ టీవి చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. పవన్ కళ్యాణ్, త్రిష తో పాటు సినిమా కు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారని సమాచారం. ఈ ఆడియో వేడుక ఫంక్షన్ లో ఈ చిత్ర కథానాయిక అయిన త్రిష ఓ పాటకు డ్యాన్స్ చేయబోతుందని సమాచారం.

కాగా పవన్ కళ్యాణ్ కి నితిన్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. అయితే ఆ వంకతోనైనా నితిన్ సినిమాలు ఒక్కసారైనా చూడ్డానికి పవన్ అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. కానీ నితిన్ మాత్రం వారిని వదలకుండా సోపేస్తున్నాడు. వీలు దొరికినప్పుడల్లా పవన్ కల్యాణ్ ని పొగిడేసి, పవన్ ఫ్యాన్స్ ని మస్త్ ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ 'తీన్ మార్" మూడ్ లో ఉన్నాడు. ఈ చిత్రం టైటిల్ గురించి అందరికంటే ముందే ప్రకటించి పవన్ ఫ్యాన్స్ ని మెప్పించిన నితిన్ తాజాగా ఈ చిత్రం పాటల గురించి కూడా హింటిచ్చాడు. పాటలన్నీ అదిరిపోయాయని, ముఖ్యంగా ఓహో బస్తీ దొరసాని పాటయితే రచ్చ లేపుతుందని చెప్పాడు. ఇంతగా తమ అభిమాన నటుడి గురించి పడి చస్తోన్న కుర్రాడ్ని చూసి కనీసం ఈసారయినా పవన్ ఫ్యాన్స్ అంతా ఓసారి నితిన్ సినిమా చూస్తే అతనూ మళ్లీ హిట్ ట్రాక్ పడతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X