Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కళ్యాణ్ తో నటించినాలని హీరోయిన్సే కాదు హీరోలక్కూడా పోటీయే...
పవన్ కళ్యాణ్ అంటే హీరో నితిన్ పడి చచ్చిపోతుంటాడు. తొలిప్రేమ, ఖుషీ చిత్రాలని లెక్కలేనన్ని సార్లు చూసిన నితిన్ తను హీరో అయ్యాక కూడా పవన్ ని అంతే ఇష్టంగా అభిమానిస్తున్నాడు. పవన్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలనేది నితిన్ చిరకాల వాంఛ. తాను హీరోగా బిజీగా ఉన్న రోజుల్లో కూడా పవన్ సినిమాలో చిన్న పాత్రయినా చేయడానికి రెడీ అని నితిన్ అన్నాడు. ఇప్పుడైతే అవకాశాలే లేక ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ సినిమా ఛాన్సొస్తే మరింత హ్యాపీ అవుతాడు.
'దబాంగ్"ని 'గబ్బర్ సింగ్" పేరుతో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ కథలో తనకి సవతి సోదరుడిగా ఎవరు బాగుంటారని చూస్తున్నాడు. శర్వానంద్, శివాజీ, శ్రీకాంత్..ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరూ నితిన్ పేరు చెప్పట్లేదు. ఆ క్యారెక్టర్ తనకిస్తే పవన్ కి తమ్ముడిగా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని నితిన్ తన సన్నిహితులతో అంటున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పవన్ కి చేరవేస్తే నితిన్ 'గబ్బర్ సింగ్"తమ్ముడైపోతాడు.