తెరవెనుక రవితేజపై కుట్ర పన్నుతున్న ఆ హీరో ఎవరు..?
నిర్మాతల హీరో రవితేజ..మినిమమ్ గ్యారెంటీ హీరో రవితేజ. మాస్ మహారాజా రవితేజ. ఈ రవితేజ వెనక నిర్మాతలు ఎందరు క్యూ కడుతున్నారో లెక్కలేదు. అతిని సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టేందుకయిన వెనకడుగువేయడం లేదు నిర్మాతలు. అందుకు తగ్గట్టుగా రవితేజ కూడా వారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. కాని అతని సినిమా స్థాయి పెరిగినట్టుగానే అతని స్థాయీ పెరుగుతుంది. ఈ మధ్య రవితేజ గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త తెలిసింది.
అదేమిటంటే ఇప్పటివరకు రవితేజ రెమ్యునరేషన్ మూడు లేదా నాలుగు కోట్లు ఉందని..అది దాటేస్థాయి అతనిలోలేదని, అతని మార్కెట్ అంతేనని అనుకొంటున్నారు అందరూ. కానీ అతను సడన్ గా తన తర్వాత చిత్రానికి పది కోట్లు డిమాండ్ చేశాడని అంటున్నారు. అతనడగడం కొంత ఆశ్చర్యమే అయితే సదరు నిర్మాత ఓకే అనేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలతని మార్కెట్ ఏమిటి..?ఇతర అగ్రహీరోలతో అంటే ఎన్టీఆర్, పవన్, మహేష్ లతో పోలిస్తే..అతనెంత. వారే ఆరేడు కోట్లకు ఓప్పుకుంటుంటే రవితేజ ఇంత డిమాండ్ చేయడమేమిటనే ప్రశ్నలు ఫిల్మ్ నగర్ మొత్తం వినవస్తున్నాయి.
తెలుగు చిత్రాలు అధిక బడ్జెట్ తో తయారవుతున్నాయి. దానికి తగిన రేంజ్ లో వ్యాపారం లేక చతికిలబడి భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇంత వరకు ఈ పరిశ్రమ ఇలా నెట్టుకు రాగలుగుతుందంటే రవితేజ, శ్రీకాకంకత్ లాంటి వారు సర్ధుకుపోగల హీరోలు, నిర్మాతలకు సహకరించే హీరోలు ఉండడంవల్లనే. కానీ అలాంటి రవితేజ ఒక్కసారే రెట్టింపు చేయటం ధర్మంకాదు అనుకొంటున్నారు. ఈ డిమాండ్ రవితేజ మొహర్ రమేష్ చేయబోయే భారీ సినిమాకు చేశాడని కూడా అంటున్నారు.
ఇదిలా ఉంటే రవితేజ అలాంటివాడు కాదని, తనేంటో తన సినిమాల పరిస్థితేలంటో అతనికి బాగా తెలుసని ఇలా పెంచడని ఇండస్ట్రీలో అతని ఎదుగుదలను ఇష్టపడని కొందరు(ఓ హీరో పేరు కూడా చెబుతున్నారు) ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











