పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకొంటున్నాడా?
ప్రజారాజ్యం అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా! అని 'పవన్ కళ్యాణ్' అన్నప్పుడు అది ఆవేశంతో అంటోన్న మాట అని, కచ్చితంగా పవన్ రాజకీయాల్లో కొనసాగుతాడని అనుకున్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతవరకు రాజకీయాల ఊసెత్తలేదు. ప్రజారాజ్యం కార్యక్రమాల్లో ఎక్కడా కనబడలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమర శంఖారావం మోగడంతో ఇప్పుడైనా తమ్ముడొస్తాడని పీఆర్పి శ్రేణులు ఆశిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తనకు ఎన్నడూ బాసటగా వుంటాడని చిరంజీవి గట్టిగా చెప్తూ వుండడంతో నేడో రేపో తమ్ముడు బరిలో దిగుతాడని ప్రజారాజ్యం శ్రేయోభిలాషులు కాంక్షిస్తున్నారు. కానీ పవన్ మాత్రం షూటింగ్స్ తో బిజీగా వుంటూ, సినిమా తర్వాత సినిమా ఒప్పుకుంటూ రాజకీయాలకు దూరంగానే వుంటున్నాడు. చూస్తోంటే పవన్ తన మాటలకు కట్టుబడి వున్నట్టే అనిపిస్తోంది. చేసిన ప్రతిజ్ఝ కంటే పార్టీ ప్రతిష్ట ముఖ్యం కనుక తమ్ముడు తప్పక మనసు మార్చుకుంటాడని అభిమానులు ఆశ పడుతున్నారు. మరి వారి ఆశలను తీర్చడానికి తమ్ముడు మాట తప్పుతాడా?


Click it and Unblock the Notifications











