Prabhas ఫ్యాన్స్​కు పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ సెన్సేషనల్ లైనప్​ - వేల కోట్ల బిజినెస్​!

Prabhas Upcoming Movies పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్​గా సలార్​తో బాక్సాఫీస్​ ముందు భారీ సక్సెస్​ను అందుకున్న ఆయన తన తదుపరి సినిమాల కోసం రెడీ అవుతున్నారు. ఇప్పుడాయన ముందు భారీ లైనప్ ఉంది. ఆయన చేతిలో దాదాపు నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. దాని గురించే ఈ కథనం..

గతేడాది సలార్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్నారు రెబల్ స్టార్​ హీరో ప్రభాస్. నెక్ట్స్​ ఈయన నుంచి రాబోతున్న భారీ చిత్రం 'కల్కి 2898 ఏడి'. ఈ మోస్ట్ ఎవెయిటెడ్‌ చిత్రాన్ని మహానటి ఫేమ్​ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో భారీ వ్యూస్​ను అందుకుని టాక్ ఆఫ్​ ది ఇండస్ట్రీగా నిలిచింది. మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్​గా విడుదల చేస్తున్నారు.

Hero Prabhas Managing Movies with Wig Video Goes Viral

ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్​ నుంచి ఈ ఏడాది రాబోయే చిత్రాలు రాజాసాబ్, కన్నప్ప​. హారర్ కామెడీ జానర్​లో దర్శకుడు మారుతి ఈ రాజాసాబ్​ను తెరకెక్కిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్‌ దీనిని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నప్పలో ప్రభాస్ శివుడి పాత్ర పోషిస్తున్నారు. అలా రాబోయే ఈ 12 నెలల్లో మూడు చిత్రాల్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్​ను అలరించనున్నారు.

ఇక ఈ చిత్రాలతో పాటు వచ్చే ఏడాది సలార్2, స్పిరిట్, కల్కి సీక్వెల్ రానున్నాయి. వీటిపై అంచనాలు కూడా అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. సలార్​కు కొనసాగింపుగా సలార్​ 2 వచ్చే అవకాశముంది. వీలైనంత వరకు ఈ చిత్రాన్ని ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్, స్వాగ్ అభిమానులకు హై ఫీస్ట్ ఇచ్చింది. అలాగే సలార్ 2 స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందట. అందుకే వీలైనంత త్వరగా సలార్‌ 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. వచ్చే 15 నెలల్లో సలార్ 2ను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో 2025లో విడుదల చేస్తామని ఆ మధ్య చిత్ర నిర్మాతలు తెలిపారు.

Hero Prabhas Managing With Movies with Wig Video Goes Viral

ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్​, కల్కి సీక్వెల్ సందడి చేయనున్నాయి. ఇంకా ప్రభాస్ లైనప్​లో మళ్లీ జక్కన్న పేరు కూడా వినిపిస్తోంది. ఈయనతో పాటు బోయపాటి శ్రీను, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్​లో కూడా ప్రభాస్ నటించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వీరిలో లోకేశ్ కనగరాజ్​ తన సినిమాను కన్ఫామ్ కూడా చేశారు.

ఇక ఈ సినిమాల లైనప్ మధ్యలో మరో వినిపిస్తున్న పేరు హను రాఘపూడి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇది వ‌ర‌ల్డ్ వార్ నేప‌థ్యంలో సాగే అద్భుత‌మైన ల‌వ్ స్టోరీ అని అంటున్నారు. అలా ప్రభాస్​ చేతిలో ఇంత పెద్ద లైనప్ ఉంది. మరి ఈ చిత్రాలన్ని అనుకున్న సమయానికే వస్తాయా లేదా అన్నది క్లారిటీగా చెప్పలేం. ఈ చిత్రాలన్ని అనుకున్నట్లు తెరకెక్కితే వేల కోట్ల బిజినెస్ జరగడం ఖాయం. కానీ ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్​ మాత్రం ఈ భారీ లైనప్​తో పండగ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X