Prabhas Marriage: ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్... ప్రభాస్ పెళ్లికి 5000 ప్రపోజల్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున ప్రభాస్ అనేస్తాం. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా ఆయన పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆయన పెళ్లి ఎప్పుడూ అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడూ మా హీరో ఓ ఇంటివాడు అవుతాడా అని వెయ్యికళ్లతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ పెళ్లి గురించి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆయనకు ఇప్పటి వరకు 5000 పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయట. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఇక మొదటి సినిమాతోనే అమ్మాయిలకు తెగ నచ్చేశాడు. ఇక వర్షం సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ.. ఆ బాడీ కటౌట్ చూసి అమ్మాయిలు అంతా ఫిదా అయిపోయారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు.

Hero Prabhas received 5000 Wedding proposals Till Now Full Details Here

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందులో అనుష్క శెట్టితో కలిసి నటించాడు. ఇక వీరి జంటకు జనాలు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రభాస్ నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. దీంతో ప్రభాస్ పెళ్లి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటకు వచ్చింది. ప్రభాస్ కు ఈ ఏడాది పెళ్లి చేయాలని ఆమె పెద్దమ్మ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా ఈ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..ప్రభాస్ పెళ్లి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Hero Prabhas received 5000 Wedding proposals Till Now Full Details Here

ప్రభాస్ పెళ్లికి ఇప్పటి వరకు 5000 ప్రపోజల్స్ వచ్చాయట. ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లికి ఇన్ని ప్రపోజల్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. ప్రభాస్ ఏదో ఒకటైనా యాక్సెప్ట్ చేయ్.. లేదంటే అనుష్కను అయినా చేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్ కే కల్కి 2898 సినిమా, మారుతి రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు స్పిరిట్ సిినిమా కూడా త్వరలో ప్రారంభం కానుదంట. ఈ సినిమా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుంది. డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ఏడాది నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X