twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుడితిలో పడ్డ ఎలకలా రాజశేఖర్, జీవిత

    By Srikanya
    |

    మొన్నటివరకూ చిరంజీవిని, పీర్ఫీ పార్టీని,బ్లడ్ బ్యాంక్ ని తిట్టడంలో బిజీగా ఉన్న రాజశేఖర్ కు జీవితంలో ట్విస్ట్ లు ఎదురవ్వటంతో సైలెంట్ అయ్యారు. ఆయన తాజా చిత్రం మహంకాళి పూర్తైనా కొనేవారు ఎవరూ లేకపోవటంతో ఏం చేయాలో తోచని స్ధితిలో పడ్డాడు. పోనీ సొంతంగా విడుదల చేద్దామా అంటే ఆర్దికంగా పరిస్ధితి అంతంత మాత్రంగా ఉందిట. దాంతో రాజశేఖర్ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది. ఈ సినిమా సంగతి వదిలేసి మిగతా విషయాల్లో బిజీ అవుదామా అంటే రాజకీయాల్లోనూ జగన్ పట్టించుకోవటం లేదు. పోనీ సినిమాల్లో దూసుకుపోదామంటే తనతో సినిమాలు తీసే ధైర్యం చేసే నిర్మాత కనపడటం లేదు. ఈ పరిస్ధితిల్లో రాజశేఖర్ కు ఏం చేయాలో పాలుపోవటం లేదు. దీనికితోడు గతంలో బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ విమర్శలు చేయటంతో పరువు నష్టం దావా వేసారు. అదో తలనొప్పి ఎదురవుతోంది.

    ఇక మహంకాళి లో రాజశేఖర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా చేస్తున్నారు. కధ విషయానికి వస్తే ..హైదరాబాద్‌ నగరం ఉగ్రవాదులకి అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా దాని మూలాలు రాజధానిలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. అంటే మన వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి విషయాల్ని చర్చించే సినిమాయే 'మహంకాళి'. ఇక చిత్రం వాస్తవిక దృక్పథంతో సాగి అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. తప్పకుండా ఇది 'అంకుశం' సినిమాకు రెండో భాగంలా ఉంటుంది అంటున్నారు రాజశేఖర్. ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, సలీమ్ పండా, ఆర్ కె, ఆషిష్ విద్యార్ధి, మురళీ శర్మ, సుప్రీత్, పిడి రాజు వంటి వారు నటిస్తున్నారు. పి.జి వింద కెమెరా అందిస్తుంటే చిన్న సంగీతం సమకూరుస్తారు. ఈ చిత్రానికి మొదట కార్తికేయ అనే దర్శకుడుతో ప్రారంభించారు. అయితే అనుకోని విధంగా సీన్ లో కి జీవిత ప్రవేశించి మెగాఫోన్ చేపట్టింది.

    English summary
    Dr. Rajasekhar's new movie 'Mahankali' has completed its shooting and currently under post production work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X