బాలకృష్ణ సినిమాలో మరో సీనియర్ హీరో.. ఆ కలయికతో వచ్చేసిన క్లారిటీ!
అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు ఆ ప్రచారానికి ఇచ్చే విధంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది ఆ వివరాల్లోకి వెళితే

అత్యధిక కలెక్షన్లు
చాలా కాలం పాటు సరైన హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడిన నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ సినిమాతో మళ్లీ మంచి కంబాక్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రస్తుత నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

రావిపూడి దర్శకత్వంలో
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మీద ప్రస్తుతానికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.

బాలకృష్ణ స్నేహితుడిగా
అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణ ఒక యాభై ఏళ్ల వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన కుమార్తెగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే ఆమె సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని కూడా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో బాలకృష్ణ స్నేహితుడిగా హీరో రాజశేఖర్ నటించిన అవకాశం ఉందని కూడా అన్నారు.

అంచనాలు
అయితే రాజశేఖర్ పాత్రకు డబ్బింగ్ కూడా లేకుండా సహజంగా ఆయన ఎలా మాట్లాడతారో అలాగే ఉండేలాగా అనిల్ రావిపూడి అడిగాడని అలా చేయడానికి కూడా రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. కానీ తాజాగా అనిల్ రావిపూడి ఆఫీస్ కి జీవిత రాజశేఖర్ వెళ్లి రావడంతో ఈ వార్తలన్నీ నిజమే అని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మామూలుగానే నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
Recommended Video


అంచనాలు రెట్టింపు
అలాంటి సినిమాలో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో కూడా నటిస్తున్నాడు అంటే ఆ అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇక అనిల్ రావిపూడి ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ విషయానికి వస్తే ఆయన కూడా శేఖర్ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. కానీ సినిమా బాగానే ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Click it and Unblock the Notifications











