Ram Charan ఇండియన్‌ ౩ మూవీలో రామ్‌ చరణ్.. ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడిచే న్యూస్!

RRR మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. పాన్ ఇండియా రేంజ్ నుంచి అంతర్జాతీయంగా అద్భుతమైన గుర్తింపు అందుకుని ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. అలాంటి మెగా పవర్ స్టార్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా.. అలా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. చెర్రీ సినిమాల గురించి వచ్చే వార్తలను తన ఫ్యాన్స్ వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ గురించి రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే శంకర్ ఒకేసారి అటు కమల్‌ హాసన్ హీరోగా ఇండియన్ 2, మరోవైపు రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ చేస్తుండటంతో.. చెర్రీ మూవీ కాస్త ఆలస్యం అవుతోంది. ఇండియన్ 2 మూవీ కూడా మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ కావడంతో.. దేనిని తక్కువ చేయకుండా పర్ఫెక్ట్ ఔట్‌పుట్ కోసం శంకర్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇండియన్ 2 సినిమా గురించి వచ్చిన కీలక అప్‌డేట్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.

Hero Ram Charan And Director Shanker Combo Indian 3 Movie Will Coming Soon Check Details

ఇండియన్ 2 ప్రీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ కనిపించనున్నాడని, అందులో కీలక పాత్ర చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఇండియన్ 2 క్లైమాక్స్ తర్వాత కూడా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని సమాచారం. గేమ్ ఛేంజర్ సినిమా ముగియగానే చరణ్‌తో శంకర్ ఈ కీలక సీక్వెన్స్ తెరకెక్కిస్తారట. అలాగే ఇండియన్ 2 కు కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా తెరకెక్కిస్తారట శంకర్. ఇండియన్ 3 మూవీలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ కీ రోల్ చేయబోతున్నాడని బజ్ క్రియేట్ అయింది. కీ రోల్ అంటే విలనా, లేక హీరోగానా అనేది తేలాల్సి ఉంది.

RRR మూవీ సూపర్ డూపర్ హిట్ కావడం, ఆ తర్వాత అందులోని సాంగ్‌కు ఆస్కార్ రావడంతో.. రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం గ్లోబల్ స్థాయికి పెరిగిపోయింది. ఈ ఇమేజ్‌ను వాడుకోవాలని శంకర్ భావిస్తున్నారని, ఇండియన్ 3 లో చరణ్ నటించనున్నారని సమాచారం. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న లియో సినిమాలో చెర్రీ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడన్న బజ్ క్రియేటైన విషయం తెలిసిందే. అయితే అందులో నిజం లేదని లియో టీమ్ ఇప్పటికే తేల్చేయడంతో అటు తమిళ సినీ ప్రేక్షకులు, ఇటు తెలుగు సినీ అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇండియన్‌ 2లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడన్న వార్త అయినా నిజం కావాలని చెర్రీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Hero Ram Charan And Director Shanker Combo Indian 3 Movie Will Coming Soon Check Details

కాగా, చెర్రీ మాత్రం ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. సంక్రాంతి బరిలో నిలవాల్సిన సినిమా లేట్ అవుతోందని, సమ్మర్ లో రిలీజ్ కానుండటంతో వేగంగా చేసేయ్యాలని చెర్రీ భావిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ అయిపోగానే వెంటనే బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు రామ్ చరణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X