హీరో రామ్ నెక్ట్స్ దర్శకుడు ఖరారు

By Srikanya

Hero Ram next with Gopi Mohan
హైదరాబాద్ : వరస ఫ్లాప్ లతో దూసుకు పోతున్న రామ్ రీసెంట్ గానూ..వెంక కలిసి చేసిన 'మసాలా'చిత్రం సైతం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో రామ్ తదుపరి చిత్రాల ఎంపిక విషయంలో రామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, ఈ నేపధ్యంలో ప్రూవ్ అయిన రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

గోపీ మోహన్ మొదట నుంచీ దర్శకత్వ విభాగంలో పనిచేసిన వ్యక్తే. తేజతో కలిసి చాలా సినిమాలకు పనిచేసారు. అయితే మొదటి సారిగా దశరథ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చటంతో ఆయన ఆ రంగంలో బిజీ అయ్యారు. గోపీ మోహన్ మొదటి నుంచి కథా విశ్లేషణ పరంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని ఆయన దర్శకత్వంలో మంచి చిత్రం వస్తుందని అంతా భావిస్తున్నారు.

'రైటర్ గా ఏదో ఇబ్బందులు ఉన్నాయని డైరెక్టర్ అవడంలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్టర్ అవుదామని, కానీ అప్పట్లో నాకు డైరెక్షన్ అంటే పెద్దగా తెలియదు. కానీ రైటర్ గా మారి పేరు, అనుభవాన్ని సంపాదించుకున్నాను. ఇప్పుడు డైరెక్షన్ పై పూర్తి అవగాహన వచ్చింది కాబట్టే డైరెక్టర్ అవుతున్నాను. ఒక రైటర్ ఎంత మంచి స్టొరీ రాసిన దాన్ని డైరెక్టర్ తీసే విధానం మీదే ఆ సినిమా జయాపజయాలు ఉంటాయి. అందుకే స్క్రీన్ ప్లే మీద పట్టున్న వారే డైరెక్టర్ కాగలడని' గోపీ మోహన్ అన్నారు.

పూర్తి స్థాయి ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుగా గోపీ మోహన్ తన కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలన్నింటిలో గోపీమోహన్ కృషి ఉంది. ఇక దూకుడుకి కథ సమకూర్చినా టైటిల్ కార్డులో కథ, స్క్రీన్, దర్శకత్వం, మాటలు... శ్రీను వైట్ల అని వేయించుకున్నారు. దాంతో గోపీమోహన్ మనస్థాపం చెందినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి.

ఈ విషయమై ఆయన గతంలో ట్వీట్ చేస్తూ...'నేను ఇండస్ట్రీకి వచ్చిందే దర్శకుడవ్వాలనే లక్ష్యంతో. నా గోల్ అదే. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి నేను రచయితగా మారాను' అని గోపీ మోహన్ పేర్కొన్నారు. 'మంచి ప్రాజెక్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. సమయం రాగానే నా తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ మొదలవుతుంది. క్రియేటివ్ సైడ్.... రచయితగా పలువురి దర్శకుల దగ్గర పని చేయడంపై నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. నా దర్శకులందరి టాలెంట్, హార్డ్ వర్క్‌కి రెస్పెక్ట్ ఇస్తా. దర్శకత్వం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని, ఒత్తిడిలను తట్టుకుంటూ సినిమాను ప్లానింగ్‌గా ముందుకు నడిపించాలి' అని గోపీ మోహన్ చెప్పుకొచ్చారు.

ఢీ, రెడీ, దూకుడు, బాద్‌షా, దేనికైనా రెడీ, దూసుకెళ్తా వంటి విజయవంతమైన చిత్రాలకు స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన గోపీమోహన్ త్వరలో దర్శకుడు కాబోతున్నాడు. ఇటీవలే ఆయన రామ్‌కు ఓ కథ వినిపించాడని, గోపీ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి రామ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని వచ్చే నెల లేదా జనవరి ప్రధమార్థంలో అధికారికంగా తెలియజేయాలని రామ్ భావిస్తున్నాడని చిత్ర వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X