ఒకేసారి మూడు పాత్రలతో కనిపించనున్న రామ్ పోతినేని.. ఈసారి అంతకు మించి అనేలా..
రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో డిఫరెంట్ యాంగిల్ లో కనిపిస్తూ తన మార్కెట్ పరిధిని కూడా పెంచుకుంటున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రామ్ ఇటీవల రెడ్ సినిమాతో మొత్తానికి డీసెంట్ హిట్ అయితే అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత చేసిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టకపోయినా కూడా ప్రొడ్యూసర్ ను నష్టాల్లో పడకుండా కొంత లాభాన్ని అందించింది. ఇక నెక్స్ట్ ఈ హీరో త్రిబుల్ రోల్స్ తో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమాతో ఋజువయ్యింది
ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు కూడా రామ్ పోతినేనిలో అసలైన మాస్ యాంగిల్ ను ఎవరు చూపించలేదు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం తన స్టైల్ లో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఆ సినిమాతో రామ్ కూడా పర్ఫాక్ట్ మాస్ హీరో అని ఋజువయ్యింది. ఇక రెడ్ సినిమాలో కూడా కొంత ఆ భావాలను చూపించాడు.

రెడ్ అందించిన లాభాలు.. ఎంతంటే
రెడ్ సినిమాలో రామ్ రెండు విభిన్నమై ఆ పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. తమిళ్ తడమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 5కోట్లకు పైగా లాభాలను అంధించి సుపర్ హిట్ గా నిలిచింది. కిషోర్ తిరుమల ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి మరో మంచి హిట్ అందుకోవడంతో రామ్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

మూడు పాత్రల్లో రామ్..
రామ్ పోతినేని రెడ్ సినిమాలో డ్యూయల్ రోల్స్ తో మెప్పించగా ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో త్రిపాత్రాభినయంలో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ స్క్రిప్ట్ పై మనసు పారేసుకున్న రామ్ ఎలాగైనా ఈ ఏడాదిలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.

దీక్ష పూర్తయిన తరువాత..
ఒక కొత్త దర్శకుడు చెప్పిన ఆ కథలో మాస్ యాక్షన్ లవ్ అన్ని కూడా సమానంగా ఉంటాయట. చూస్తుంటే రామ్ ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. కొంతమంది సీనియర్ దర్శకులు కథలు చెప్పినప్పటికీ రామ్ మాత్రం ఆ కొత్త దర్శకుడిపైనే ఫోకస్ పెట్టినట్లు టాక్. ప్రస్తుతం శివమాలలో ఉన్న రామ్ దీక్ష పూర్తయిన తరువాత కొత్త ప్రాజెక్ట్ తో బిజీ కానున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











