ఎన్టీఆర్ సినిమాని రామ్ ఆపే ప్రయత్నం?

మొత్తానికి రకరకాలగా చర్చలు జరిపి ఈ వివాదాన్ని మొత్తానికి సెటిల్ చేసినట్లు చెప్పుకున్నారు.రామ్ కి ఇవ్వాల్సిన కోటి రూపాయలులో కొంత కోత పెట్టి ఈ సెటిల్ మెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రామ్ వసూలు చేసుకునే భాగంగా...కేసు ఫైల్ చేస్తారని, దాని ఎఫెక్ట్ రభపై పడుతుందని చెప్తున్నారు. కందీరీగ చిత్రానికి ఈ రభస చిత్రం సీక్వెల్ వంటిదని, దర్శకుడు కూడా సంతోష్ శ్రీనివాసే కావటంతో తన విషయం సెటిల్ అయ్యేంతవరకూ ఆ చిత్రం షూటింగ్ ఆపే విధంగా కోరుతాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా సమాచారమేదీ లేదు. ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న విషయం మాత్రమే.
వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్సప్రెస్ దర్శకుడుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా కథలు వింటూ దర్శకులను మారుస్తూ...తమకే క్లారిటీ లేకుండా సిట్టింగ్ లు జరుపుతూ వస్తున్నారు. దాంతో ఇప్పుడు రామ్ తో చిత్రం అంటే అసులు ఉంటుందో ఉండదో అని దర్శకులు భయపడే స్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు. పెద్ద దర్శకులు ఎవరూ అటు వెళ్లరు. మిడిల్ దర్శకులు వెళ్దామని ఆశపడినా...తమ ఇన్ సెక్యూరిటీతో కథలో రకరకాల మార్పులు చెప్పటంతో వారు ప్రాజెక్టులు నుంచి తమంతట తామే తప్పుకుంటున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications











