ProjectK టీమ్ తో రానా అమెరికా టూర్ ఇందుకా..మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేశారుగా..అసలు సీక్రెట్ తెలిసిపోయిందిగా!

'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ ను ఆవిష్కరించేందుకు ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ కు మూవీటీమ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడికి ఆ టీమ్ తో పాటు రానా కూడా వెళ్లారు. అయితే ఆయన ఎందుకు వెళ్లారో అసలు నిజం తెలిసింది. భారీ ప్లాన్ తోనే ఆయన అక్కడికి వెళ్లారు. వివరాళ్లోకి వెళితే..

ప్లాన్ మాములుగా లేదుగా: సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ. అదే 'ప్రాజెక్ట్ కె'. తాజాగా ఈ సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. మరోవైపు 'ప్రాజెక్ట్ కె' మూవీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ వేదికపై 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు.

Hero Rana Daggubati Announce Hiranyakashyap lords of the deccan at comic con news viral in social media

అయితే మూవీటీమ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా అక్కడికి వెళ్లారు. దీంతో తన స్నేహితుడు ప్రభాస్ కోసం రానా అమెరికా వెళ్లారని అంతా అనుకున్నారు. కానీ అసలు ‌విషయం బయట పడింది. రానా అక్కడికి వెళ్లింది గ్లోబల్ వైడ్ గా తన కొత్త సినిమాలను అనౌన్స్ చేయడానికి అని తెలిసింది.

ఎంతో ప్రీ ప్లాన్డ్ గా: 'బాహుబలి' సిరిస్ తర్వాత రానా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఆశించిన స్థాయిలో భారీ హిట్లను అందుకోలేదు. దీంతో ఆయన ఇకపై నటించబోయే, అలాగే నిర్మించబోయే సినిమాలపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మార్కెట్ పరంగా ఎంతో ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నారు. అందులో భాగంగానే ఆయన కామిక్ కాన్ వేదికపై తన 'స్పిరిట్' మీడియా నిర్మాణ సంస్థలో నిర్మించబోతున్న చిత్రాలను ప్రకటించబోతున్నారట. ఇందులో చిత్రాలతో పాటు సిరీస్, కామిక్స్ కూడా ఉండనున్నాయట.

Hero Rana Daggubati Announce Hiranyakashyap lords of the deccan at comic con news viral in social media

హిరణ్యకశిపుడిగా రానా: ఇందులో ఒకటి స్వయంగా రానా హీరోగా నటించబోయే 'హిరణ్యకశిపుడు'. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్ నే రానా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు తెలిసింది. ప్రముఖ కామిక్ స్టోరీ 'అమర్ చిత్ర కథ' స్పూర్తితో దీన్ని రూపొందిస్తున్నారట. ఇందులో రానా టైటిల్ రోల్ పోషించబోతున్నారట. ఈ సినిమా కథను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారని తెలిసింది.

Hero Rana Daggubati Announce Hiranyakashyap lords of the deccan at comic con news viral in social media

చాళుక్య సామ్రాజ్యం పై సిరీస్: ఇకపోతే 'హిరణ్యకశిపుడు' చిత్రంతో పాటు చాళుక్య సామ్రాజ్యం పై 'లార్డ్స్ అఫ్ ది డెక్కన్' అనే సిరీస్ ను నిర్మించబోతున్నారు రానా. ఇది వెబ్ సిరీస్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. మరో ప్రముఖ సంస్థ సోని లివ్ తో కలిసి స్పిరిట్ మీడియాపై ఈ సిరీస్ ను నిర్మించబోతున్నారని తెలిసింది. ఫుల్ యాక్షన్ మోడ్ లో దీన్ని తెరకెక్కిస్తారని తెలిసింది.

Hero Rana Daggubati Announce Hiranyakashyap lords of the deccan at comic con news viral in social media

కామిక్ వెర్షన్ లో మిన్నల్ మురళి: అలాగే రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన సూపర్ హీరో మూవీ 'మిన్నల్ మురళి'. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ హీరో చిత్రం తెలుగులో కూడా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడా చిత్ర నిర్మాతలతో కలిసి.. మిన్నల్ మురళి కామిక్ వెర్షన్ ను రానా నిర్మించబోతున్నారట.

ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి... రానా కామిక్ కాన్ వేదికపై ప్రకటించబోతున్నారని తెలిసింది. తద్వారా ఇండియన్ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా తెలుసుకుంటున్న సినీ ప్రియులు రానా పెద్ద ప్లానే వేశారుగా అని కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X