దిల్ రాజు కు స్టార్ హంట్ లో దొరికింది ఈ కుర్రాడా?

By Srikanya

హైదరాబాద్: దిల్ రాజు కెరీర్ ప్రారంభంలో నాన్ స్టార్ ఫిల్మ్ లు కేవలం కథను నమ్మే చేసేవారు. అయితే కాలక్రమంలో స్టార్స్ డేట్స్ పట్టుకోవటం, భారీ బడ్జెట్ లతో సినిమా చేసి టేబుల్ ప్రాఫెట్ కు అమ్ముకోవటం అనే రెగ్యులర్ కాన్సెప్టుకు వచ్చేసారు. అయితే మళ్లీ ప్రారంభ రోజులు గుర్తు వచ్చో ఏమో కానీ ఓ నాన్ స్టార్ ఫిల్మ్ ని, కేవలం కథనే నమ్మి చేయటానికి సిద్దమయ్యారు. కేరింత టైటిల్ తో రూపొందే ఆ చిత్రాన్ని వినాయకుడు దర్సకుడు సాయి కిరణ్ తో రూపొందించాలని ప్లాన్ చేసారు.

ఈ కేరింత చిత్రం కోసం గత కొద్ది నెలలుగా స్టార్ హంట్ నిర్వ హించారు. మరి స్టార్ హంట్ లో సమర్ధులు అయిన వాళ్లు లభించలేదో ఏమో కానీ ఇప్పుడు సీన్ లోకి నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడు రేవంత్ వచ్చాడు. రేవంత్ తన తొలి చిత్రం ఇంటింటి అన్నమయ్య రిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. లక్కీ హ్యాండ్ అని రాఘవేంద్రరావు చేతిలో పెట్టినా ఆ సినిమా విడుదలకే నోచుకోవటం లేదు. అయితే ఇప్పుడు ఈ కేరింతతో అతను ఖచ్చితంగా హిట్ కొట్టి టాలీవుడ్ లో సెటిల్ అవుతాననే నమ్మకంగా ఉన్నారు. అయితే మరో ప్రొడ్యూసర్ కుమారుడుతో సినిమా చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈ స్టార్ హంట్ లు వంటి స్టంట్స్ ఎందుకు అంటున్నారు.

Hero Revanth Babu Gets a Chance in Dil Raju Film?

'వినాయకుడు' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ''కుర్రకారు మనోభావాల్ని ఆవిష్కరించే కథ ఇది. సాయికిరణ్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రచయిత అబ్బూరి రవితో కలిసి ఆ కథని మరింత బాగా తీర్చిదిద్దాం. ఈ చిత్రంతో కొద్దిమంది సాంకేతిక నిపుణులను కూడా పరిచయం చేస్తున్నాం. నటీనటుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ''ని తెలిపారు.

సాయికిరణ్‌ అడవి మాట్లాడుతూ... ''ఈ కథపై ఎప్పట్నుంచో కసరత్తులు సాగుతున్నాయి. అబ్బూరి రవి మాతో కలవగానే కథ కొత్తరూపం సంతరించుకొంది'' అన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు.

''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్‌ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని మొదలుపెడుతున్నాం'' అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X