దర్శకుడిపై శర్వానంద్ అసహనం.. ఆ సెంటిమెంట్ తోనే అంతా టెన్షన్!

వరుస పరాజయాల తర్వాత శర్వానంద్‌.. ఒకే ఒక జీవితం చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ సినిమా తర్వాత.. వివాహం చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. ఇటీవల తన కొత్త సినిమాను ప్రకటించాడు. శర్వానంద్‌ కెరీర్‌లో 35 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అయితే ఈ సినిమా దర్శకుడిపై శర్వానంద్ అనసహనం వ్యక్తం చేశాడట. ఆ వివరాల్లోకి వెళితే...

ఒకే ఒక జీవితంతో లైన్లోకి...
ఈ మధ్యనే వివాహం చేసుకొని ఒక ఇంటివాడైన శర్వానంద్ ఇప్పుడు సినిమాల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నాడు. చివరిగా ఒకే ఒక జీవితం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంతమేర ఆ సినిమాతో సక్సెస్ సాధించాడు. పూర్తిస్థాయిలో ఆయనకు ఆ సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా కొంతవరకు తమిళంలో కూడా మార్కెట్ అయితే క్రియేట్ అయింది.

Sharwanand

షాకింగ్ వార్త తెరమీదకు...
ఇప్పుడు ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. గతంలో దేవదాస్ వంటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ సినిమా ఎలా ఉండబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఒక షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది.

Sharwanand

దర్శకుడిపై అసహనం...
అదేమిటంటే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మీద శర్వానంద్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే సినిమా ఫైనల్ కాపీని శర్వానంద్ చూశాడని.. శర్వానంద్ సినిమా చూసిన తర్వాత దర్శకుడు మీద ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. కథగా చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యే విధంగా చెప్పిన మాట వాస్తవమే కానీ.. అదే ఎగ్జిట్ మెంట్ సినిమా చూసినప్పుడు ఏమాత్రం కలగలేదని చెప్పారట. చెప్పిన కథను అంతే అద్భుతంగా తెరమీదకు ఎక్కించడంలో ఎక్కడో తేడా అయిందని శర్వానంద్ దర్శకుడుతో అన్నట్లుగా తెలుస్తోంది.

Sharwanand

నష్టం మాత్రం నిర్మాతకే...
అయితే దర్శకుడు వర్గం మాత్రం శర్వానంద్ సినిమా షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు ఏరోజు కారోజు ఆన్ లైన్ ఎడిటింగ్ అవుట్ పుట్ కూడా చూసేవాడని... అప్పుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఈ మేరకు పూర్తిగా తప్పు దర్శకుడిదే అన్నట్లుగా రాళ్లు వేయడం కరెక్ట్ కాదని ఆఫ్ ది రికార్డ్ గా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తప్పు ఎవరిదైనా టోటల్ గా లాస్ అయ్యేది మాత్రం నిర్మాత అని చెప్పక తప్పదు.

Sharwanand

ఆ సెంటిమెంట్ వల్లే...
కచ్చితంగా పెళ్లయిన తర్వాత రిలీజ్ అయ్యే మొదటి సినిమా కాబట్టి దాంతో హిట్టు కొట్టాలనే శర్వానంద్ ప్రయత్నిస్తాడు. లేకపోతే భార్య మీద సెంటిమెంట్ పడే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X