ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లను లైన్‌లో పెట్టిన యువ హీరో.. ఒకరితొ రొమాన్స్.. మరొకరితో అలా!
తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తదనం కోసం చిన్న నిర్మాతల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రొడ్యూసర్ వరకు పరితపిస్తున్నారు. అయితే కంటెంట్ ఉంటే చాలూ చిన్న సినిమానా? భారీ బడ్జెట్ మూవీనా? అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దాంతో యువ హీరోలు కూడా నవ్యత, ఆడియెన్స్‌ను కట్టిపడేసే చిత్రాల కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే నవ దళపతి సుధీర్ బాబు మరో అద్బుతమైన చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమా విషయానికి వస్తే..
గతంలో హీరో సుధీర్ బాబు తన సొంత బ్యానర్‌పై ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే సినిమాలను అందించారు. అదే కోవలో ప్రస్తుతం సూపర్ నేచురల్ పవర్ కథా నేపథ్యంగా జటాధర అనే మూవీని అందించబోతున్నారు. ఈ సినిమాను ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై అందించనున్నారు. ఈ సినిమాను ప్రేరణ అరోరా, శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే భారతీయ సినిమా రంగంలో మైలురాయిగా నిలిచే విధంగా సినిమా కథ ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఒకరు జంటగా రొమాన్స్ చేయడానికి సిద్దమైతే.. మరొకరు విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
పౌరాణిక, ఫాంటసీ, డ్రామా నేపథ్యంగా రూపొందే ఈ సినిమాను మహాశివరాత్రి పండుగ కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నది. 2025 సంవత్సరంలో రిలీజ్ కాబోయే మూవీ ఆడియెన్స్‌ను కొత్త అనుభూతికి గురి చేస్తుందని యూనిట్ పేర్కొన్నది.

ఇదిలా ఉండగా, సుధీర్ బాబు సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల హరోంహర అనే సినిమాతో హిట్ అందుకొన్నారు. త్వరలోనే మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా అక్డోబర్ 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగా.. థియేటర్లలో చేసేలా ఈ ప్రమోషన్స్ దోహదపడ్డాయి.


Click it and Unblock the Notifications











