ఆ ఫోటో లీక్‌పై హీరో సునీల్ సీరియస్...
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ ప్రస్తుతం పూల రంగడు చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇటీవల లీకయ్యాయి. అయితే ఈ సిక్స్ బాడీ గురించి మొదట్లో సునీల్ నుంచి గానీ, దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాక పోవడంతో...ఇది నిజమైందా? లేక గ్రాఫిక్స్ మాయా? అనే సందేహాలు కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా ఈ ఫోటోలను బయటకు లీక్ చేసిన వ్యక్తిపై సునీల్ సిరీయస్ అయినట్లు సమాచారం. వాస్తవానికి సునీల్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోలను మీడియాకు అందజేసి, అలా బాడీ బిల్డ్ చేయడానికి తాను పడ్డ కష్టాన్ని వివరించడంతో పాటు, సినిమా వివరాలను వెల్లడించాలని అనుకున్నాడట. అయితే తనకు తెలియకుండానే సిక్స్ ఫ్యాక్ ఫోటోలు బయటకు లీక్ కావడంతో సునీల్ ప్లాన్ తారుమారైంది.
వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్న పూల రంగడు చిత్రంలో ఇషా చావ్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి చివరి వారంలోగానీ, ఫిబ్రవరి మొదటి వారంలోగానీ విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











