twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమీషన్ ఇస్తేనే కథ ఓకే చేస్తున్న హీరో!

    By Staff
    |

    నటీనటులు దగ్గర డబ్బులు తీసుకుని వేషాలు ఇవ్వటం సినీ పరిశ్రమలో బహిరంగంగా చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారం. ఇప్పుడా పరిస్ధితిని డైరక్టర్స్ ఎదుర్కోవాల్సి వస్తోందని తెలుస్తోంది. తాజాగా కార్పోరేట్ సంస్ధలు సినిమాలు తీస్తామంటున్న నేపధ్యంలో ఇటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముంబయి కో మరో సిటీకో చెందిన కార్పోరేట్ సంస్ధలు వారు తెలుగులో మార్కెట్ బాగుందని సినిమాలు తీయటానికి ముందుకొస్తున్నారు. అయితే తమకు ఇక్కడ పెద్దగా పరిచయాలు లేవని పరిశ్రమలో కాస్త పలుకబడి ఉన్న వారిని తమ తరుఫున పనిచేయమని పెడ్తున్నారు.

    అయితే వీరు ఎన్నుకునే వారు పరిశ్రమలో దర్శకులగానో,నటులుగానో ఫెయిల్ అయిన వారు కావటం విశేషం. దాంతో అంతా వారికి కథలు చెప్పటానికి లైన్ కడుతున్నారు. కానీ ఒక్కటీ మెటీరియలైజ్ కావటం లేదు. అందులోనూ బయిట వీరి గురించి నిజంగా వారికే అంత జడ్జిమెంట్ ఉంటే వారు ఎందుకు ఫెయిల్యూర్ సినిమాలు ఇస్తారని విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇక అదే కోవలో ఈ మధ్యన ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ వారు భారీ ఎత్తున సినిమాలు తీయదలచి మాజీ హీరో సురేష్ ని ఇన్ ఛార్జ్ గా పెట్టి కథలు వినమన్నారు.

    అయితే ఆయన వచ్చిందే అవకాశం అని అందిన మేరకు నొక్కేయటానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇక ఆ నలుగురు వంటి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న చంద్ర సిధ్దార్ధ ఆ సంస్ధ వారితో సినిమా చేయాలని సంప్రదించినప్పుడు ఇది బయిటకు వచ్చింది. ఆయన చెప్పిన కథ ఓకె చేసినందుకు ధర్టీ పర్సెంట్ ఇవ్వాలని సురేష్ పట్టుబట్టాడని చెప్తున్నారు. అయితే బడ్జెట్టే నామమాత్రంగా ఉందనీ, ఏదో ఆనందంగా ఏ పార్టీనో అంటే అర్ధం ఉంది కానీ ఇలా డైరక్ట్ గా అడిగితే ఎలా ఆయన వాపోయాడుని తెలుస్తోంది. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఇదే విషయం అంతటా చర్చిస్తున్నారు. ఎటు వైపు పరిశ్రమ వెళ్తోందని...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X