»   » 'బాహుబలి' పార్ట్ 2 లో కీలకపాత్రలో సూపర్ స్టార్

'బాహుబలి' పార్ట్ 2 లో కీలకపాత్రలో సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం వచ్చే నెల 10 వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ తెరపైకి వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రం రెండవ భాగంలో ...ఓ సూపర్ స్టార్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారని, ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ అంటే తమిళ హీరో సూర్య అని తమిళ మీడియా అంటోంది. ఈ మేరకు రాజమౌళి ఓ ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. ఇది రూమర్ గా మిగిలిపోతుందా లేక నిజమవుతుందా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Hero Surya In Baahubali 2nd Part

జూలై 10కల్లా బాహుబలి మొదటి భాగం విడుదలైపోతుంది. మరి దీనికి కొనసాగింపుగా తయారవుతున్న ‘బాహుబలి 2' విడుదల ఎప్పుడన్నదే తర్వాతి ప్రశ్న. అయితే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నాడు.


కొంతమందేమో బాహుబలి రెండోభాగం షూటింగ్ కూడా పూర్తయిందని, కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలున్నాయని అంటున్నారు. మరికొంతమందేమో కేవలం 40శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని, మిగిలింది ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే మేలో సినిమాను విడుదల చేస్తారని చెబుతున్నారు.


Hero Surya In Baahubali 2nd Part

అయితే ‘బాహుబలి 2' నటీనటులంతా వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోవడంతో అంతా గందరగోళంగా మారింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది అనుకున్న సమయానికి విడుదలవుతోందో, లేదోనన్నది అనుమానంగా మారింది.


రాజమౌళి చెప్పిన వివరాల ప్రకారం ‘బాహుబలి 2' షూటింగ్ కూడా దాదాపుగా సగం పూర్తయింది. ప్రస్తుతం ‘బాహుబలి' టీం మొత్తం ప్రస్తుతం పార్ట్ -1 విడుదలపైనే దృష్టి సారించారు. నటీనటులంతా ప్రచార కార్యక్రమాల్లో అంతా బిజీ అయ్యారు. ప్రత్యేకంగా మరో టీం ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. రాజమౌళి నేతృత్వంలోనే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
we hear that Rajamouli is planning to create a new character in Baahubali-2 which will be played by hero Surya.
Please Wait while comments are loading...