డ్రగ్స్ భయంతో పబ్ ను అమ్ముకొన్నఆ హీరో ఎవరంటే..!?
లవర్ బోయ్ తరుణ్ కి సినిమా కెరీర్ ఆశాజనకంగా లేదు. అందుకేనేమో కనీసం పబ్ అయినా పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుని 'ఆన్ పబ్" ఆరంభించాడు. అయితే ఈ పబ్ ను ఇటీవల అమ్మేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ సోదరులు భరత్, రఘు మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పట్టుబడిన తర్వాత సినిమా పరిశ్రమలో ఈ బాపతుకి చెందిన వారు చాలామంది ఉన్నారని పోలీసులు అంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న పది ప్రముఖ పబ్స్ లో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోందని, రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంటామని కూడా పోలీసులు అన్నారు. ఎందుకొచ్చిన గొడవ అని తరుణ్ తన పబ్ ని అమ్మేసి ఉంటాడు. ఒకవేళ తన పబ్ లో డ్రగ్స్ వ్యాపారం లేకపోతే తరుణ్ ఎందుకు భయపడినట్టు ? ఈ పబ్ లో కూడా ఫలానా వ్యవహారం జోరుగా సాగుతోందేమో...


Click it and Unblock the Notifications











