మహేశ్ విలన్‌ను మార్చేసిన రాజమౌళి.. పృథ్వీరాజ్ కాదు అంతకు మించినోడే!
తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు స్టార్ల కాంబినేషన్లలో సినిమాలు రావాలని వాళ్ల అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే, సినీ ప్రియులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న కొన్ని కలయికలు ఉన్నాయి. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో ఒకటి. వీళ్లిద్దరి సినిమా కోసం ఎంతో మంది ఆశగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈ స్టార్లు ఓ ప్రాజెక్టును ప్రకటించారు. దీంతో దీనిపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో చేయబోయే విలన్ గురించి ఓ క్రేజీ న్యూస్ తాజాగా లీకైంది. ఆ వివరాలు మీరే చూడండి!
రాజమౌళితో మహేశ్ మూవీ
టాలీవుడ్‌లో బడా హీరోగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి. వీళ్లిద్దరు కలిసి భారీ ప్రాజెక్టును చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే అధికారికంగా అనౌన్స్ చేశారు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. ఇందులో హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్లు నటిస్తున్నారు.

జక్కన్న తండ్రి పని పూర్తి
రాజమౌళి - మహేశ్ బాబు కలయికలో రాబోయే ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను రెడీ చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ స్టోరీపై వర్క్ చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేశారు.

హాలీవుడ్ రేంజ్ స్టోరీతోనే
హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కనున్న మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇందులో మహేశ్ బాబు లుక్ కూడా టార్జాన్ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు.
అప్పుడే సినిమా మొదలు
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమాను 2022 ద్వితీయార్థంలోనే మొదలు పెడతారని అంతా అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం లేట్ అవుతోంది. అయితే, ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఈ మూవీ ప్రీ వర్క్ జరుగుతోంది. ఇది పూర్తైన వెంటనే అంటే మహేశ్ పుట్టినరోజున పూజ జరిపించి.. ఆ వెంటనే రెగ్యూలర్ షూట్‌ను స్టార్ట్ చేస్తారని టాక్.

ఈ ప్రాజెక్టులో మరో స్టార్
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో మహేశ్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్రను సైతం పాన్ ఇండియా రేంజ్ హీరోతోనే చేయిస్తారని అంటున్నారు. అలా ఎంతో మంది పేర్లు వైరల్ అయ్యాయి.

విలన్‌ను మార్చేశారుగా
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోయే ఈ సినిమాలో మహేశ్ బాబును ఢీకొట్టే విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ విలన్‌గా నటించబోతున్నాడట. అతడికి దేశ వ్యాప్తంగా పేరు ఉండడం వల్లే రాజమౌళి ఈ విలక్షణ హీరోకు ఓటు వేసినట్లు తాజాగా తెలిసింది. ఇదే నిజం అయితే ఈ ప్రాజెక్ట్ రేంజ్ మరింతగా పెరుగుతుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











