twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ సరసన రామ్ హీరోయిన్

    By Srikanya
    |

    సునీల్, నాగచైతన్య కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సునీల్ సరసన అక్ష ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అక్ష గతంలో రామ్ సరసన కందిరీగలో చేసింది. తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ ఆమె ఆ చిత్రంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక నాగచైతన్య సరసన మాత్రం హన్సికను తీసుకున్నారు. హన్సిక కు మంచి రేటు ఇచ్చి మరీ బెల్లంకొండ మాట్లాడి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తమిళ వెట్టై రీమేక్. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను సునీల్ చేస్తున్నారు.

    మొదటినుంచీ సునీల్ కి హీరోయిన్స్ సమస్య ఉంది. రాజమౌళి వంటి డైరక్టర్ డైరక్ట్ చేసినా కూడా హీరోయిన్ దొరకక సలోని తీసుకురావాల్సి వచ్చింది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సంబరాలు రాంబాబు లో మొదట తాప్సీని అడిగినా ఆమె ఒప్పుకోలేదు. అంతకుముందు తను వెడ్స్ మను రీమేక్ కు సైతం త్రిషను రిచా గంగోపాధ్యాను కూడా అడిగినా వారు నో చెప్పారు. సునీల్ ఇంకా కమిడియన్ గానే చూస్తూండటంతో ఈ సమస్య వస్తోంది. నిజానికి వెట్టైలో మాధవన్ సరసన సమీరా రెడ్డి చేసింది. అలాంటిది తెలుగు కి వచ్చేసరికి అక్షను తీసుకున్నారు.

    బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీని ఎన్నుకున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం. జూన్ 26నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. నాగచైతన్య ...తమ్ముడుగా కీ క్యారెక్టర్ ని చేస్తూండగా,సునీల్ ..సెకండ్ హీరో పాత్రను చేస్తున్నారు. తమిళంలో ఆర్య..పాత్రను నాగచైతన్య,మాధవన్ పాత్రను సునీల్ చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య చేస్తున్న నాగచైతన్య కు తదుపరి చిత్రం ఇదే. ఇక సునీల్ ఇప్పటికే మాధవన్ నటించిన తను వెడ్స్ మను రీమేక్ లో చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు చేసిన దేవి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

    ఇక ఈ చిత్రాన్ని మొదట తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెట్టై చిత్రం యాక్షన్‌, ప్రేమ, సెంటిమెంట్‌ సమాహారంతో రూపొందింది. ఈ చిత్రంలో మాధవన్‌, ఆర్య నటన, సమీరారెడ్డి, అమలాపాల్‌ అందచందాలు, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే యువన్‌ సంగీతం పెద్ద ఎస్సెట్‌ అయింది. ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలోనే హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి షాహిద్‌కపూర్‌ హీరోగా నటించనున్నారు. ఇతర నటీనటుల సంగతి తెలియాల్సి ఉంది.

    English summary
    Bellamkonda bought back the remake rights of Tamil blockbuster, Vettai from UTV. The Telugu version is making with Naga Chaitanya as lead hero directed by Dolly, who earlier directed Konchem Ishtam Konchem Khastam. What's more, he has roped in comedian turned hero Sunil to play the second hero. The remake will go to the sets from June 26th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X