అషికా రంగనాథ్‌కు పాన్ ఇండియా ఆఫర్ .. 100 కోట్లతో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌లో!
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ ఏడాది మొదట్లోనే నా సామిరంగా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ఆమె పాన్ ఇండియా ఎంట్రీకి పూల బాటను పరిచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన భారీ ఫ్యాంటసీ మూవీ విశ్వంభరలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఆషికా రంగనాథ్ మరో పాన్ ఇండియా మూవీలో నటించే అద్భుతమైన ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. మరి ఆ మూవీ ఏంటో ఒక లుక్కేద్దాం పదండి.
ప్రస్తుతం సౌత్ లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. నాగార్జున సరసన నా సామిరంగా అంటూ రొమాన్స్ చేసిన ఆషికా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ విశ్వంభరలో కూడా ఒక పాత్రను పోషిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆషికాకు ఒక పాన్ ఇండియా బిగ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా అవకాశం దక్కిందని టాక్ నడుస్తోంది.

ఆ ప్రాజెక్టు ఏదో కాదు సర్దార్ 2. కార్తీ, రాశి ఖన్నా జంటగా నటించిన సర్దార్ సీక్వెల్ లో ఆషికా రంగనాథ్ కూడా భాగం కాబోతోందని తెలుస్తోంది. కార్తీ కెరీర్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పెట్టిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్. ఈ మూవీకి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్ ను రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇందులో విలన్ గా ఓ ప్రముఖ నటుడి పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ నడుస్తుండగా, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. సర్దార్ సినిమాకు పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగవ సినిమా సర్దార్ 2. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ సర్దార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్ కెరీర్ ఈ మూవీతో పీక్స్ కి వెళ్తుందా ? అనేది అనుమానమే.
ఎందుకంటే గతంలో సర్దార్ మూవీలో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నాకు ఆ మూవీ ఏ రకంగానూ ఉపయోగపడలేదు. నిజానికి క్రెడిట్ మొత్తం కార్తినే కొట్టేశాడు. హీరోయిన్ ఉందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ గుర్తించలేదు. మరి సీక్వెల్ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుందా? లేదంటే హీరోయిన్ కి కూడా పేరు వస్తుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆషికా రంగనాథ్ కు కూడా రాశి ఖన్నా విషయంలో జరిగినట్టే జరిగితే ఈ ఛాన్స్ గురించి ఆమె మరోసారి ఆలోచించుకోవాలి అంటున్నారు ఫ్యాన్స్.

ఎందుకంటే ఇప్పుడు ఆమె సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉంది. అలాంటిది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రాధాన్యత లేని పాత్రలో నటిస్తే అది ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో? ఒకవేళ నిజమైతే అది ఆషికా రంగనాథ్ కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











