14 గెటప్స్‌లో యంగ్ హీరో.. హిజ్రాగా కూడా.. ఎంత మంది హీరోయిన్లను దింపుతున్నారో తెలుసా?
కుర్ర హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది సామాజవరగమన సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఈ ఏడాది ఓం భీమ్ బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా తరువాత శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం స్వాగ్. హాసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసేటప్పుడే అచ్ఛ తెలుగు సినిమా అని తెలిపి హైప్ ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఈ చిత్రం నుంచి ఏ అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మేకర్స్ సైతం అభిమానులకు హైప్ ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

తరతరాలుగా మగవాడి మనుగడను ఆడవాళ్ళు ఎలా అణగదొక్కుతున్నారు అనేది ఇందులో చూపించనున్నారట. ఇందులో శ్వాగనిక రాజుగా శ్రీ విష్ణు కనిపించనుండగా.. మహారాణి రుక్మిణి దేవిగా హీరోయిన్ రీతూ వర్మ నటిస్తోంది. ఇప్పటికే వీరి పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఇదే కొత్త కాంబో అనుకుంటే ఇందులోకి సీనియర్ బ్యూటీ మీరాజాస్మిన్ వచ్చి చేరింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మీరా జాస్మిన్ రీఎంట్రీ అనడంతో అభిమానులందరూ ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. ఆమె ఇంట్లో ఒక యువరాణి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మీరా జాస్మిన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.

అంతేకాదు ఈ సినిమాలో శ్రీవిష్ణు దాదాపు 14 గెటప్స్ లో కనిపించనునందట. అందులో హిజ్రా గెటప్ కూడా ఒకటి అని తెలియడంతో.. ఈసారి ఈ హీరో రికార్డులను బద్దలుకొట్టేట్టు ఉన్నాడని అనుకున్నారు. ఇక తాజాగా ఈ అచ్చ తెలుగు సినిమాలోకి ఇంకో బ్యూటీ వచ్చి చేరింది.
హుషారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ దక్ష నగార్కర్. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది కానీ, హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు రాణినే. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను కునుకుకు దూరం చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ స్వాగ్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో యువరాణిలా మెరిసిపోతుంది. దీంతో ఇప్పటికీ ముగ్గురు హీరోయిన్లు అయ్యారు. ఇంకా ఎంతమందిని దింపుతావ్ మావా అంటూ అభిమానులు శ్రీవిష్ణుకు కౌంటర్లు వేస్తున్నారు. మరి ఈ సినిమాతో దక్ష ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











