ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ హీరోయిన్.. మరోసారి ఆ బ్యూటీతో కొరటాల!
స్టార్ దర్శకుడు కొరటాల శివ మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనతా గ్యారెంజ్ సినిమా అనంతరం అంతకు మించి అనేలా మరో పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాగానే అభిమనులు ఎంతగానో ఆనందించారు. త్రివిక్రమ్ తో చేయాల్సిన 30వ సినిమాను కొరటాలతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే భవిష్యత్తులో త్రివిక్రమ్ తో కూడా మరొకసారి వర్క్ చేయాలని ఎన్టీఆర్ మాట తీసుకున్నాడు. ఇక కొరటాల సినిమా విషయానికి వస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ కు సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచాలని టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. హీరోయిన్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కీయరా అద్వానీని ఫిక్స్ చేసే అలచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అని కొరటాల ఆమెను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందట.
ఇక ఇదివరకే కీయరా, కొరటాల డైరెక్ట్ చేసిన భరత్ అనే నేను సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా హిట్టయినప్పటికి రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాకు ఒకే చెప్పినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











