twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతనితో డేటింగ్ ఓకే ..ఫర్జానా

    By Staff
    |

    Farzana
    బొద్దు ముద్దు గుమ్మ ఫర్జానా తను డేటింగ్ చేయటానికి ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది. అతను మరెవరో కాదుట..డాన్సర్ మైకెల్ ప్లాట్లీ. అతనంటే తనకెంతో ఇష్టమని కొరియోగ్రాఫర్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన ఆమె చెప్పుకొచ్చింది. అతనితో జత కట్టి..డాన్స్ లోని మరిన్ని మెళకువలను నేర్చుకోవాలని ఆమె తాపత్రయం అని చెప్తోంది. ఆ మద్య ఓ యంగ్ కామెడీ హీరోతో ఆమె వ్యవహారం గొడవల దాకా వెళ్ళిందన్న సంగతి తెలిసిందే. ఆ హీరో తండ్రి కలగచేసకుని తన పరపతితో ఆమెకు ఆఫర్స్ లేకుండా చేసారని అంతా చెప్పుకున్నారు.

    దాంతో ఆమె హైదరాబాద్ లో బ్రతకలేక ముంబై చెక్కేస్తుందని ఆయన ఆశ. అయితే ఆమె ఇప్పటికీ హైదరాబాద్ లోనే పలుచోట్ల దర్శనమివ్వటం ఆయనకు చిరాకు తెప్పిస్తున్న విషయం అని చెప్తున్నారు. వార్నింగ్ లు ఇచ్చినా, కొడుకుని కట్టడి చేసినా, ఆఫర్స్ చెడకొట్టినా ఆమె ఇక్కడే ఉండంట ఆయనకు ఏం చేయాలో అర్ధం కానీ స్ధితికి తెస్తోందంటున్నారు. ఇక ఫర్జానా ఈ తరహా కామెంట్స్ అన్నా ఆ కుర్ర హీరోకి చేరి రెచ్చి కొట్టడానికే నని మళ్ళి రప్పించటానికే ఈ తరహా కబుర్లు చెపుతోందంటున్నారు. చూద్దాం ఎవరి పాచిక పారనుందో...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X