Heroine: ఆ దర్శకుడికి నోటి దురుసు.. సెట్లోనే పరువు తీసిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో ఆ డైరెక్టర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆయనకు ఆ రేంజ్ గుర్తింపు ఉంది. ఇక ఆయన సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆయన సినిమాల్లోని డైలాగులు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంటాయి. అంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ డైరెక్టర్ చేసిన పనికి.. సెట్లోనే హీరోయిన్ పరువు తీసేసిందని తెలుస్తోంది. అసలు ఈ డైరెక్టర్ ఆ హీరోయిన్ ను ఏం అన్నాడు.. ఆమె ఏం చేసింది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు. అది సహజమే.. కానీ డైరెక్టర్లకు ఫ్యాన్స్ అతి తక్కువ మందికి ఉంటారు. అందులో ఆయన ఒకరు. ఇక ఆయన సినిమా తీస్తే.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని సీన్స్, డైలాగులు.. జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సామాన్యులకు ఆయన సినిమాలు కనెక్ట్ అయిపోతాయి. ఇక మొత్తానికి ఆయన సినిమా వస్తే ఫ్యాన్స్ కు పండగే.

అలాంటిది ఆయన ఓ హీరోయిన్ ప్రేమలో పడిపోయినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆయన సినిమాల్లో ఆ హీరోయినే మెయిన్ లీడ్ గా తీసుకునే వాడు. ఏమైందో తెలియదు కానీ ఆ హీరోయిన్ కు ఛాన్సులు తగ్గిపోయాయి. ఆ దర్శకుడు ఆ హీరోయిన్ ను వదిలేశాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఆ విషయం పక్కన పెడితే.. ఈయన అమ్మాయిల పట్ల కూసింత చిలిపి పనులు కూడా చేస్తాడు అన్న పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

డైరెక్టర్ గా మంచి పేరుతెచ్చుకున్న ఈయన... తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో చనువుగా మూవ్ అవుతాడంటూ పలువురు, నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం.. ఆయన చేసిన పనికి అందరి ముందే ఇచ్చి పడేసిందని తెలుస్తోంది. ఆయనతో వర్క్ చేస్తున్నాను అని కూడా మర్చిపోయి.. ఫుల్ గా వార్నింగ్ ఇచ్చేసిందట. అంతలా ఆమె ఫైర్ అవ్వడానికి కారణం ఈయనగారు చేసిన పనే అని తెలుస్తోంది.

అసలు ఏం జరగిందంటే... సినిమా షూట్ లో భాగంగా అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుతున్నారుట. అయితే ఆ సమయంలో ఆ డైరెక్టర్ ఆమెతో హద్దులు మీరు పోయి ఫన్నీ జోక్స్ వేశారని తెలుస్తోంది. ఏకంగా ఆమెపై నీచంగా జోక్స్ వేయడంతో ఆ హీరోయిన్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సెట్లోనే అందరి ముందు పరువు తీసేసిందని తెలుస్తోంది. ఆమె పర్సనల్ మ్యాటర్స్ వెటకారంగా చెప్పడంతో హీరోయిన్ ఫైర్ అయి.. డైరెక్టర్ గాలి తీసేందని టాలీవుడ్ లో చర్చనీయంశమైంది.

ఇక ఆ డైరెక్టర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమా షూటింగ్ లో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనేది టాలీవుడ్ లో చర్చగా మారింది. చూడాలి మరి ఇంకా ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











