నిర్మొహమాటంగా దొంగతనం ఒప్పుకొన్న హన్సిక
దేశముదురు, మాస్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆపిల్ బుగ్గల హన్సిక ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా 'జయీభవ" చిత్రం లో నటిస్తోంది. హన్నికా కి ఒక విచిత్రమైన హ్యాబిట్ వుందట అందేమంటే 'ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కొని తింటే రుచిగా వుండదు. దొంగలించి తింటే ఆహా ఆ రుచే వేరుగా ఉంటుందనే సూత్రాన్ని కాశ్మీర్ ఆపిల్ హన్సిక చెపుతోంది. అలా అని మీరు పప్పులో కాలువేయకండి అసలుకే మోసం వస్తుంది. నేనేదో చిన్నప్పుడు పక్కపిన్నీలు, తిను బండారాలు, వక్కపొడి దొంగలించేదాన్ని. పెద్దాయ్యాక స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కి వెలితే వారు తింటున్న ఐటమ్ ను వారిని మాటల్లో దింపి గుట్టుచప్పుడు కాకుండా తినేసేదాన్ని. అలా దొంగలించి తినేవి మహారుచిగా ఉంటాయి" అని అంటోంది హన్సిక.
ప్రస్తుతం తను కళ్యాణ్ రామ్ తో 'జయీభవ" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ లో ఏదైనా దొంగలించేద్దామనుకున్నా కానీ కుదరలేదని నిర్మొహమాటంగా చెప్పింది. కానీ నేనే ఒక దొంగని మరి నానుంచే ఒకటి దొంగలించబడిందని హన్సిక తెలివిగా సమాధానమిచ్చింది. అదేమిటంటే? నా మనసును కళ్యాణ్ రామ్ దొంగలించాడు. ఏవిధంగా అనేది సినిమాలో చూసి థ్రిల్ కావాల్సిందేనని హన్సిక ట్విస్ట్ ఇచ్చింది. ఇక నిజ జీవితంలో ఎవరైనా మీ మనసును దొంగలించారా అనే ప్రశ్నకు సింపుల్ గా ఇంకా అంత వరకూ రాలేదని చెపుతోంది దొంగ హన్సిక. మరి జర జగ్రత్త హన్సికాతో.


Click it and Unblock the Notifications











