హీరోయిన్ ను ఆ విషయంలో ఇబ్బంది పెట్టిన అగ్ర నిర్మాత.. సరిగ్గా టైం చూసి హ్యాండిచ్చిందిగా!

తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఒక సక్సెస్ ఫుల్ నిర్మాత. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆయన ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి వివాదాలలో కూడా ఆయన పేరు ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే ఇప్పుడు ఆయన మీద కొత్త విమర్శ మీడియా వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఎవరా నిర్మాత? ఏమిటా విమర్శ అనే వివరాల్లోకి వెళితే

సక్సెస్ ఫుల్ నిర్మాత

సక్సెస్ ఫుల్ నిర్మాత

తెలుగు సినీ పరిశ్రమలో సదరు నిర్మాతకు మంచి సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరుంది. చాలా జాగ్రత్తగా కాంబినేషన్స్ సెట్ చేసుకునే ఆయన ఎక్కువగా కుర్ర హీరోల కంటే కాస్త స్టార్డమ్ ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాడని ఆయనకు పేరుంది. కానీ తరచుగా జాగ్రత్తగా ఖర్చు చేయడంతో ఆయనకు పిసినారి అని కూడా పేరు పెట్టేశారు కొంతమంది సినీ వర్గాల వారు.

స్టార్లకు మంచి రెమ్యునరేషన్

స్టార్లకు మంచి రెమ్యునరేషన్

అయితే ఆయన సినిమాలు చూస్తే అలా అనిపించదు ఎందుకంటే ఎక్కువగా ఆయన స్టార్ లతోనే సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో నిండుతనం చూస్తే ఆయన నిర్మాణం విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడు అనుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా సార్లు మంచి రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించరు కాబట్టి ఆయన స్టార్లకు మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తారట. కాబట్టి, ప్రాజెక్టులు సెట్ అయ్యే విషయంలో అసలు సమస్య లేదు.

ప్రమోషన్స్‌కు దూరమై

ప్రమోషన్స్‌కు దూరమై

అయితే సినిమాలో మిగతా వారి విషయానికి వస్తే. ఆయన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో బేరసారాల ఆడతాడని టాక్ వినిపిస్తోంది. అదే విషయంలో ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవ‌లే ఆయ‌న ఒక పెద్ద సినిమా విడుద‌ల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు హీరోయిన్ పూర్తిగా దూరమైంది. అయితే ఆమెకు దర్శకుడికి మధ్య కాస్త విభేదాలు ఏర్పడడంతో సినిమా ప్రమోషన్స్ కు ఆమె రాలేదు అంటూ ప్రచారం జరిగింది.

రెమ్యునరేషన్ పెండింగ్

రెమ్యునరేషన్ పెండింగ్

కానీ నిర్మాత ఆమె రెమ్యునరేషన్ ఇచ్చే విషయంలో బేరసారాలకు దిగినందుకే హీరోయిన్ మనస్తాపానికి గురైందని అంటున్నారు. అంతేకాకుండా, ఆయన చాలా కాలం పాటు ఆమె పారితోషికాన్ని పెండింగ్‌లో ఉంచాడనీ అంటున్నారు. సాధారణంగా నిర్మాతలు ఇలా హీరోయిన్లకు రెమ్యునరేషన్ పెండింగ్ ఉంచడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ సినిమా విడుదలయ్యే ముందు దాదాపు రెమ్యునరేషన్ క్లియర్ చేస్తారు.

పదేపదే ఫాలోఅప్ చేసి

పదేపదే ఫాలోఅప్ చేసి

ఇప్పుడు మనం చెప్పుకునే నిర్మాత ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఆమె రెమ్యునరేషన్ క్లియర్ చేయడానికి సిద్ద పడకపోవడంతో పదేపదే ఫాలోఅప్ చేసిన తర్వాత ఆమె రెమ్యునరేషన్ క్లియర్ చేశారట. అయితే నిర్మాత ఆమె సహాయ సిబ్బందికి సంబంధించిన బిల్లులను కూడా పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. సాధారణంగా ఇలా జరిగితే ఒకటి రెండు సార్లు సదరు నిర్మాత ఆఫీసులో సంప్రదించి ఆమె వ్యక్తిగత సిబ్బంది వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో హీరోయిన్నే అడగడం ప్రారంభించారట.

విభేదాల కారణంగా

విభేదాల కారణంగా

ఇక ఇది కరెక్ట్ గా లేదని భావించిన ఆమె సరిగ్గా సమయం చూసుకుని సినిమా ప్రమోషన్స్ కి రాకుండా సైలెంట్ అయిపోయింది అని టాక్. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు, హీరోయిన్ కి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఆమె ప్రమోషన్స్ కి రావడం లేదంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X