SS Rajamouli: జక్కన్న సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరోయిన్.. భలే ఛాన్స్ పట్టేసిందిగా!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు. ఆయన సినిమా కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. వరల్డ్ వైడ్ టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు అని చెప్పవచ్చు. మరి ఆయన మహేశ్ బాబు హీరోగా ఓ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ ను విలన్ గా తీసుకోనున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పిందా అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డులతో పాటు... ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఈ మూవీకి వరల్డ్ వైడ్ ఫేమస్ వచ్చింది. ఇక ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందాడు. ఇక ఆయన మహేశ్ బాబు హీరోగా తన నెక్ట్స్ సినిమాను తీయబోతున్నారు. ఇక సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి.

SS Rajamouli and Mahesh Pan World Movie

ప్రస్తుతం మహేష్ బాబు గుంటురు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రీలజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది.

ఇక మహేశ్ బాబు గుంటురు కారం సినిమా తర్వాత జక్కన్న దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా ఉండబోతుందని అంటున్నారు. ఇందులో క్లారిటీ లేదు. జక్కన్న, మహేశ్ బాబు సినిమా పాన్ వరల్డ్ రేంజులో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాపై పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే వీరి కాంబోలో తెరకెక్కనున్న మూవీ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను విలన్ గా అనుకుంటున్నారట. ఆమె ఎవరో కాదు.. అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఈ భామ ఈ సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి. కాజల్ సెకండ్ ఇన్సింగ్స్ లో గ్లామరస్ పాత్రలు చేస్తూ.. దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ భామకు విలన్ రోల్ అంటే సాహసమే అని చెప్పాలి. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ మగధీర సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Heroine Kajal Aggarwal

ఇప్పుడు మరోసారి కాజల్.. రాజమౌళి దర్శకత్వంలో విలన్ పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ న్యూస్ వైరల్ గా మారింది. అసలు మొదట ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ను అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ లక్కీ ఛాన్స్ కాజల్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల ఆయన కూతురిగా కనిపించనుంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X