కృతి శెట్టి వరుస విజయాలు.. వెయిటింగ్ లిస్టులో మరో రెండు ఆఫర్స్ ?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి నార్త్ అమ్మాయిలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్క సక్సెస్ దక్కినా కూడా ఆ తర్వాత ఈజీగా మిగతా భాషల పై ఫోకస్ చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు ఈ ఆలోచన విధానం ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచి కూడా ఇదే తరహాలో నార్త్ బ్యూటీలు ఆలోచిస్తున్నారు. ఇక ముంబైకి చెందిన కృతి శెట్టి కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో ఆమె బిజీగా మారేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మొదటి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం అందంతోనే కాకుండా నటన పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంది. తను నవ్వుతోనే కొంటె చూపుతో కట్టిపడేసింది అని చెప్పాలి. తప్పకుండా ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి కెరీర్ ఉందని కూడా చాలామంది అగ్ర దర్శకులు నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవి నటించినప్పటికీ కృతి శెట్టి కూడా చాలా హైలెట్ గా నిలిచింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఫస్టాఫ్ లోనే రొమాంటిక్ సీన్స్ తోనే డామినేట్ చేసింది. నాని తో చాలా ఘాటుగా లిప్ లాక్ సీన్లో నటించడంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఒక విధంగా రొమాంటిక్ సీన్స్ చేయడానికి కూడా ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పకనే చెప్పేసింది.

పద్దెనిమిదేళ్ల వయసులో కృతి శెట్టి తీసుకుంటున్న నిర్ణయంతో అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బంగార్రాజు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. అలాగే సుధీర్ బాబు తో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు కూడా మంచి స్క్రిప్ట్ తో తెరకెక్కుతున్నాయి.
వీటితో పాటు కృతి శెట్టి మరో రెండు ఆఫర్లు అందుకున్నట్లు తెలుస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందట. అంతే కాకుండా గోపీచంద్ శ్రీవాస్ సినిమాలో కూడా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఆఫర్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఏడాది కూడా బిజీ బిజీగా కనిపిస్తుంది. అంతేకాకుండా వెయిటింగ్ లిస్ట్ లో కూడా కొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ప్రాజెక్టులు కూడా సెట్ అయితే కృతి శెట్టికి ఈ ఏడాది తిరుగుండదు అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











